హైదరాబాద్ వచ్చేందుకు ఎదురుచూస్తున్నా..: ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్, ఆ రెండు కార్యక్రమాల్లోనూ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పర్యటనపై మోడీ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మోడీ వెల్లడించారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్నారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య విరాట్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. కాగా, ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు.
మొదట శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతోపాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోడీ వెంట ఉంటారు.

కాగా, ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలలో ప్రధానిపాల్గొని నూతన లోగోను ఆవిష్కరించి, అక్కడి శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పటానుచెరులో 1972లో ఏర్పాటైన ఇక్రిశాట్ సంస్థ 3,434 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధానంగా ఇక్కడ కంది,జొన్న, వేరుసెనగ, సెనగ,సజ్జలు లాంటి వంద రకాల వంగడాలను ఆవిష్కరించింది. అంతేగాక, ఇటీవల కొత్తగా పోషకాహార భద్రత కల్పించే వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. ఇక్రిశాట్‌ను పటానుచెరు లోనే ఏర్పాటు చేయడం వెనుక జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో కసరత్తు జరిగింది.
I look forward to being in Hyderabad today to take part in two programmes. At around 2:45 PM, I will join the 50th Anniversary celebrations of ICRISAT, an important institution that works on aspects relating to agriculture and innovation.
— Narendra Modi (@narendramodi) February 5, 2022
రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు రీతులను దగ్గరచేస్తూ ఆసియా,ఆఫ్రికా ఖండాలలో ఆహార సంక్షోభ నివారణకు ఈ పరిశోధనా సంస్థ ఎంతగానో సహాయపడుతోంది. రైతులకోసం ప్రత్యేకంగా అదీ అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఉన్నాయంటే మొదటిగా వినిపించేది "ఇక్రిశాట్" పేరే. సైన్స్ విత్ హ్యుమన్ ఫేస్ నినాదంతో యాభై అయిదు దేశాల రైతులకు అండగా నిలుస్తోంది. ఇక్కడ మానవాళి మనుగడకు మేలు చేసే అనేక పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications