తెలంగాణలో నేటి నుంచి కాలేజీలు బంద్..!
తెలంగాణలోని ప్రైవేట్, వృత్తి విద్య కళాశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నేటి ( సెప్టెంబర్ 15, 2025 ) నుంచి నిరవధిక బంద్ చేయనున్నట్టు కళాశాలల యాజమాన్యాల సమాఖ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం గత ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని వేడుకున్నప్పటికీ.. స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. దీంతో పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, బీఈడీ, నర్సింగ్ సహా అన్ని వృత్తి విద్య కాలేజీలు ఈరోజు నుంచి మూతపడనున్నాయి.
10 వేల కోట్ల బకాయిలు..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫెడరేషన్ తెలిపింది. ఈ నిధులు విడుదల కాకపోవడంతో కాలేజీల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటోందని.. విద్యారంగం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఫీజు బకాయిల కారణంగా పలు కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.

అయితే ఈ బంద్ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేయాలని వర్సిటీలను ఫెడరేషన్ కోరింది. విద్యార్థులు కళాశాలలకు రాకూడదని, పరిస్థితిని తల్లిదండ్రులు అర్థం చేసుకుని సహకరించాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి.
అర్ధరాత్రి వరకు సాగిన చర్చలు..
మరోవైపు ఈ సమస్యపై ప్రభుత్వం ఆదివారం రాత్రి కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొనసాగింది. ఈ సందర్భంగా కళాశాలల సమస్యలు అర్థం చేసుకున్నామని.. ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. అప్పటివరకు సమ్మెను వాయిదా వేయాలని కోరారు. సోమవారం ( సెప్టెంబర్ 15, 2025 ) మధ్యాహ్నం 3 గంటలకు మరోమారు ఉప ముఖ్యమంత్రితో చర్చల అనంతరం మాత్రమే తమ తుది నిర్ణయం వెల్లడిస్తామని కళాశాలల ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇక పలు ఇంజినీరింగ్ కళాశాలలు ఇప్పటికే విద్యార్థులకు సెలవుల నోటీసులు పంపాయి. కొన్నింటి ప్రకారం ఈ నెల 17 వరకు తరగతులు ఉండవని.. మరికొన్ని వారం రోజుల పాటు బంద్ ఉంటుందని ప్రకటించాయి. కొన్ని మాత్రం ఆన్‌లైన్ క్లాసులు కొనసాగుతాయని విద్యార్థులకు సమాచారం అందించాయి. అయితే నాలుగు ఇంజినీరింగ్ కళాశాలలు మాత్రం బంద్‌లో పాల్గొనకుండా తరగతులు కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.
యాజమాన్యాల డిమాండ్లు..
ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులను దసరాలోపు చెల్లించాలి.
గత నాలుగేళ్ల బకాయిలను డిసెంబరు 31లోపు విడుదల చేయాలి.
బోధనా రుసుములు ఎప్పటికప్పుడు చెల్లించేలా ట్రస్ట్ బ్యాంకు ఏర్పాటుపై ఫీజిబిలిటీ నివేదికను అక్టోబరు 31లోపు ఇవ్వాలి.
ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త ఫీజులకు సంబంధించిన జీఓను విడుదల చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను డిసెంబరు 31లోపు పూర్తిగా చెల్లించాలి.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications