వోల్వో బస్సు బోల్తా: 20 మందికి గాయాలు, 5గురి పరిస్ధితి విషమం
హైదరాబాద్: మేఘనా ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విజయనగరం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మేఘనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం వద్దకు రాగానే జాతీయ రహదారి-65పై ఢీకొట్టి బోల్తాపడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు చికిత్స అందిస్తోన్న వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటానా స్ధలానికి చేరుకుని పరిస్ధితి పర్యవేక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నారు. అధిక వేగంతో వస్తున్న బస్సు టైరు పగలడంతోనే ఈ ప్రమాదం జరగడానికి కారణమని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications