బంజారా మహిళలతో ప్రియాంకా గాంధీ స్టెప్పులు; కాంగ్రెస్ లో జోష్!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో జోష్ తో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్నా చెల్లెళ్ళ సందడి ఆసక్తికరంగా మారింది. ఒకపక్క ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేస్తూనే వారు ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఇక తాజాగా నిన్నటికి నిన్న ఒక సామాన్య మహిళ ఇంటికి వెళ్లి నువ్వు నా స్నేహితురాలివి అని పేర్కొని, ఫోన్ నంబర్ ఇచ్చిన ప్రియాంకా గాంధీ, ఎన్నికల సభకు వచ్చిన మహిళలతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. ఇక తాజాగా రేవంత్ రెడ్డి పాటకు తండా మహిళలతో కలిసి ప్రియాంకా గాంధీ స్టెప్పులు వేశారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ రోడ్ షోలలో పాల్గొంటూ ఉత్సాహంగా ప్రసంగాలను సాగిస్తున్నారు. అంతేకాదు రోడ్ షో కి వచ్చిన కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపేందుకు ప్రియాంక గాంధీ ప్రచార రథం పైన డాన్స్ చేసే అందరిని అలరించారు.
ప్రచారంలో భాగంగా తాండ మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన ప్రియాంకాగాంధీ..!#PriyankaGandhi #Dance #Khammam #TelanganaElection2023 #TelanganaElections2023 #Telangana #Oneindiatelugu pic.twitter.com/217zd5jIAE
— oneindiatelugu (@oneindiatelugu) November 25, 2023
కాంగ్రెస్ పార్టీ లో అగ్రనేతగా ఉన్నప్పటికీ సామాన్యంగా సామాన్య ప్రజలతో కలిసిపోవటంలో ప్రియాంకా గాంధీధీ తనదైన స్టైల్.ఖమ్మంలో జరిగిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేశారు. బంజారా మహిళలతో కలిసి ప్రచార రథం పై సంతోషంగా స్టెప్పులేసిన ప్రియాంక గాంధీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి పాటకు డాన్స్ చేయడంతో అక్కడ అందరిలో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ప్రియాంకా గాంధీ డ్యాన్స్ కు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ ఇచ్చిన జోష్ తో ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు.












Click it and Unblock the Notifications