మనమిద్దరం ఫ్రెండ్స్ నా నంబర్ తీసుకో.. సామాన్య మహిళతో ప్రియాంకా గాంధీ!!
తెలంగాణలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో పాలకుర్తి, సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో విజయభేరి సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఈ మేరకు రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలన పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణలో పర్యటించిన ప్రియాంక గాంధీ అక్కడ పలువురు సామాన్యుల ఇళ్లకు వెళ్లారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రియాంక గాంధీ ఒక స్థానిక జంటను కలుసుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక సామాన్యురాలి ఇంటికి వెళ్లిన ప్రియాంకగాంధీ ఆమెను ఆశ్చర్యానికి గురి చేశారు. ఆప్యాయంగా పలకరించారు. నువ్వు నాకు స్నేహితురాలు అవుతావా అంటూ ప్రశ్నించారు. ఆమెను దగ్గరకు తీసుకొని ప్రియాంకగాంధీ ఎంతో ఇష్టంగా ముద్దు పెట్టుకున్నారు.

సిద్ది పేట్ జిల్లా హుస్నాబాద్ లో సభ ముగించుకొని రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం అయిన ప్రియాంక గాంధీ హుస్నాబాద్ మండలం లోని గాంధీ నగర్ పరిధిలో కిషన్ నగర్ లోని ఓ పేద దంపతుల ఇంటికి వెళ్లి జాగీరు రమాదేవి - రాజయ్య ల దంపతులను పలకరించారు. దీంతో ఆ దంపతులు ఆనంద పారవశ్యానికి లోనయ్యారు.
ఇక ప్రియాంక గాంధీ తన ఇంటికి రావడంతో అప్పటికే సంభ్రమాశ్చర్యాలకు లోనైన సదరు మహిళ, తనను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడంతో మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. తనకు ఇందిరమ్మ ను కలుసుకోవాలని ఎప్పటినుంచో ఉండేదని, కానీ ఇప్పుడు అచ్చం ఇందిరాగాంధీ లా ఉన్న ప్రియాంక గాంధీని కలవడం తనకు చాలా సంతోషంగా ఉందని మహిళ ప్రియాంక గాంధీకి తెలిపారు.
ఆమెతో మాట్లాడిన ప్రియాంక గాంధీ నువ్వు నా స్నేహితురాలు అవుతావా అంటూ ప్రశ్నించి, ఆ మహిళ ఫోన్ నెంబర్ తనకు ఇవ్వమని అడిగారు. తన నెంబర్ కూడా సదరు మహిళను తీసుకోమని చెప్పి ప్రియాంక గాంధీ తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక ఏకంగా ఆమె తన ఫోన్ నంబర్ సామాన్య మహిళకు ఇవ్వటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
మనమిద్దరం ఫ్రెండ్స్ నా నంబర్ తీసుకో అని ఓ మహిళతో చెప్పిన ప్రియాంకా గాంధీ..!!!#PriyankaGandhi #Congress #TCongress #TSAssemblyElections2023 #TSElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElection2023 #TelanganaElections2023 #Oneindiatelugu pic.twitter.com/b1WowmHitG
— oneindiatelugu (@oneindiatelugu) November 24, 2023
ఒక జాతీయ పార్టీకి అగ్ర నాయకురాలుగా ఉన్న ప్రియాంక గాంధీ, ఒక సామాన్యురాలి ఇంటికి వెళ్లి ఆమెతో ప్రేమగా మాట్లాడడం, ఆమెపై వాత్సల్యాన్ని చూపించడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే రోడ్డు మార్గంలో సభకు వచ్చి, తిరిగి వెళ్తున్న వాహనాల్లోని మహిళలతో సెల్ఫీలు దిగారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications