Priyanka Reddy Murder: అర్ధరాత్రి ఏం జరిగిందంటే.. మీడియాతో నిందితుడి తల్లి
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యకేసులో తెలంగాణ పోలీస్ శాఖ వేగంగా చర్యలు తీసుకొంటున్నది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. కేవలం 24 గంటల్లోనే అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నిందితులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అందుతున్నది. బుధవారం రాత్రి డాక్టర్ ప్రియాంకారెడ్డిపై నలుగురు వ్యక్తులు లైంగిక దాడి చేసి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు వివరాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా తల్లి మీడియాతో మాట్లాడారు.

హత్య వెలుగులోకి రాగానే
గురువారం మధ్యాహ్నం ప్రియాంకారెడ్డి హత్య వెలుగులోకి రాగానే సంచలనం రేపింది. వెంటనే తీవ్రతను గుర్తించి సైబారాబాద్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. అర్ధరాత్రికి ప్రధాన అనుమానితుడిని అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత మరో ముగ్గురు అనుమానితులు నవీన్ (డ్రైవర్), శివ (క్లీనర్), కేశవ్ (క్లీనర్) అదుపులోకి వివరాలు సేకరించారు.

నా కొడుకు రాత్రి ఇంటికి
తన కుమారుడు మహ్మద్ పాషా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చారు అని నిందితుడు తల్లి మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత శుక్రవారం తెల్లవారు జామున పోలీసులు వచ్చి తన కుమారుడు పాషాను వెంట తీసుకెళ్లారు. తన కుమారుడు హైదరాబాద్‌లో లారీ నడిపిస్తుంటాడు అని నిందితుడి తల్లి మీడియాకు వివరించారు.

నా కొడుకు ఏం చేశాడో తెలియదు..
ప్రియాంకారెడ్డి హత్య కేసుతో తన కుమారుడికి సంబంధముందనే విషయం తెలిసిన తర్వాత ఆమె కన్నీరుమున్నీరయ్యారు. నా కొడుకు ఏమి చేశాడనే విషయం నాకు తెలియదు అని మహ్మద్ పాషా తల్లి అన్నారు. ఇలాంటి దారుణానికి తన కుమారుడు పాల్పడ్డాడనే విషయంతో షాక్ గురయ్యానని ఆమె భోరున విలపించారు.
Recommended Video

మీడియా ముందుకు నిందితులు
కాగా, ప్రియాంకా రెడ్డి హత్య కేసుకు సంబంధించిన అనుమానితులను, నిందితులను పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఈ కేసులో వివరాలను పోలీస్ కమిషనర్ మీడియాకు వివరిస్తారు. ప్రస్తుతం నలుగురు నిందితుల నుంచి నేరానికి సంబంధించిన వివరాలను పోలీసు శాఖ సేకరిస్తున్నది. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో వేగంగా ఈ కేసు పురోగతి చోటుచేసుకొంటున్నది.












Click it and Unblock the Notifications