ఘనమైన చరితకు మరకలు..! నిధుల కొరతతో విలవిలలాడుతున్న ఓయూ..!!
Recommended Video

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీని కష్టాలు వెక్కిరిస్తున్నాయి. ఆర్దిక ఇబ్బందులు ఓయూను కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నాయి. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉస్మానియా కూరుకుపోయింది. కొన్ని నెలలుగా వేతనాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితితో సతమతమవుతోంది. పదవీ విరమణ పొందిన వారికి సంబంధిత ప్రయోజనాలు ఇవ్వడంలోను తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఒకటో తేదీన వేతనాలు అందక ఉద్యోగుల వెతలు..! పట్టించుకోని యంత్రాగం..!!
వీటి పరిస్థితే ఇలా ఉంటే.. విద్యార్థులకు అత్యవసరమైన వసతిగృహాలు, అందులో సౌకర్యాల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండట్లేదు. యూనివర్సిటీ ఏడాది మొత్తం ఆదాయంలో ఉద్యోగుల వేతనాలకు సుమారు 284.55 కోట్ల రూపాయలు, పెన్షనర్లకు 200.80 కోట్ల రూపాయలకు పైబడి చెల్లిస్తున్నది. ఈ రెండింటికి మొత్తం 485.35 రూపాయల నిధులు అవసరం అవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్ రూపంలో 309.54 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ లోటు పూడ్చుకునేందుకు ఉస్మానియా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలస్తోంది.

స్వీయ పాలనలో కూడా తీరని కష్టాలు..! ఆందోళన వ్యక్తం చేస్తున్న సిబ్బంది..!!
పరీక్షల విభాగం, విదేశీ సంబంధాలు, దూర విద్య, అడ్మిషన్లు విభాగాల నుంచి సమకూరుతున్న ఆదాయమే ఉస్మానియా కొంత ఆదుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంటు మినహా ఇతర నిధులు రాకపోవడంతో కొత్త పనుల ప్రతిపాదనలు మూలనపడ్డాయి. కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు పాత పద్దతిలోనే కొనసాగుతున్నాయి.

పెద్దయెత్తున బకాయిలు..! చోద్యం చూస్తున్న అదికారులంటున్న ఉద్యోగులు..!!
ఈ కోర్సులను రెగ్యులర్ విధానంలోకి తీసుకొస్తే వచ్చే ఆదాయం తగ్గిపోతుందనే ఆందోళన యూనివర్సీటీని వేధిస్తున్నది. ఫీజలు భారం కారణంగా నిరుపేద, మధ్య తరగతి విద్యార్థులు ఈ కోర్సులకు ఆమడ దూరంలోనే ఉండిపోతున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి ఆర్థిక ఇబ్బందులకే అడ్డంకిగా మారాయి. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన సందర్భాలు గత కొన్నేళ్లుగా లేవు.

జీతాలకే ఇంత ఇబ్బందులైతే ఎలా..! అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న ఓయూ సిబ్బంది..!!
నిధులు ప్రతినెలా ఏదో ఒక కారణంగా జాప్యం జరుగుతూనే ఉన్నాయని పలువురు వివరిస్తున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసరాలు తదితర ఖర్చులకు తరచూ తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉద్యోగులు తెలిపారు. వేతనాల కోసం సమ్మెలు చేయాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో నిరసన తెలియజేస్తే 4వ తేదీన వేతనాలు విడుదల చేశారని అంటున్నారు. ఇదీ ఘనమైన చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల కష్టాలు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications