ప్రొ.పాపిరెడ్డి తొలగింపు -తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ప్రొ.లింబాద్రి నియామకం -కేటీఆర్‌కు థ్యాంక్స్

కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యా సంస్థలను పున:ప్రారంభిచడంతోపాటు తెలంగాణలో ఉన్నత విద్యా రంగానికి సంబంధించి కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవీ నుంచి పాపిరెడ్డిని ప్రభుత్వం తొలగించింది. ఆ స్థానంలో నూతన చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రిని నియమించింది. కొత్త టీఎస్సీహెచ్ఈ చైర్మన్ లింబాద్రి.. మంత్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలివి..

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉనికిలోకి వచ్చిన తెలంగాణ ఉన్నత విద్యామండలికి తొలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ పాపిరెడ్డి సుదీర్ఘంగా ఏడేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలం ముగిసినా కూడా అదే స్థానంలో సర్కారు పాపిరెడ్డిని కొనసాగించింది. పాపిరెడ్డి కొనసాగింపును సవాలు చేస్తూ హైకోర్టులో ఓయూ జేఏసీ నేత కురువ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వివరాలతో పాటు పాపిరెడ్డిని కొనసాగించక పోవడమే మంచిదని అదనపు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో వివాదాల్లో ఉన్న పాపిరెడ్డిని ప్రభఉత్వం తొలగించింది..

Prof. Limbadri appointed as Chairman of TSCHE as kcr govr removes Prof. Papi Reddy

కోర్టు వివాదాల కారణంగా ప్రొఫెసర్ పాపిరెడ్డి తొలగింపునకు గురికాగా, ఆయన స్థానంలో ప్రొఫెసర్ లింబద్రిని కేసీఆర్ సర్కారు నియమించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదనంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు లింబాద్రి ఈ స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా లింబాద్రి మంత్రి కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే,

Prof. Limbadri appointed as Chairman of TSCHE as kcr govr removes Prof. Papi Reddy

Recommended Video

    ఏడేళ్లుగా జరిగిన అభివృద్దిపై పెదవి విరిచిన మూడుచింతలపల్లె గ్రామస్తులు..!! || Oneindia Telugu

    తెలంగాణలో సెప్టెంబర్‌ 1నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు మంగళవారం జిల్లాల కలెక్టర్లు, విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అందరి భాగస్వామ్యంతో పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ క్లాసులకు ముగింపు పలుకుతామన్నారు. 65 లక్షలమంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+