వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రిలో ప్రోటోకాల్ వివాదం .. కేంద్రమంత్రులు వచ్చినా హాజరుకాని ఈవో; భగ్గుమన్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలోని అధికార బీజేపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇక రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా, మంత్రులు వచ్చినా ప్రోటోకాల్ పాటించకుండా లేదు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా సాగుతోంది. తాజాగా మరోమారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత సందర్భంగానూ ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది.

bandi sanjay: మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి నుండి షురూ.. యాదగిరిపల్లిలో సభకు కేంద్రమంత్రులుbandi sanjay: మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్ర యాదాద్రి నుండి షురూ.. యాదగిరిపల్లిలో సభకు కేంద్రమంత్రులు

యాదాద్రికి కేంద్ర మంత్రులు.. ప్రోటోకాల్ పాటించని ఆలయ ఈవో

యాదాద్రికి కేంద్ర మంత్రులు.. ప్రోటోకాల్ పాటించని ఆలయ ఈవో

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్రను నేడు యాదగిరిగుట్ట నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యాదగిరిగుట్ట కు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి,దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ముందుగా వీరంతా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు వచ్చిన కారణంగా ప్రోటోకాల్ ప్రకారం ఆలయ ఈఓ గీతారెడ్డి వారితో పాటు ఉండవలసి ఉంది. అయితే ఆలయ ఈఓ గీతారెడ్డి హాజరు కాకపోవడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నారు.

 గతంలో గవర్నర్ కు అవమానం .. ప్రోటోకాల్ రగడ

గతంలో గవర్నర్ కు అవమానం .. ప్రోటోకాల్ రగడ


గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ యాదాద్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఏకంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పటికీ ఆలయ ఈఓ గీతారెడ్డి హాజరుకాలేదు. తమిళిసై సౌందరరాజన్ కు బిజెపి ముద్రవేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు చూస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఆమెపై విముఖతను వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆమె పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ పాటించకుండా ఆలయ ఈఓ గీతారెడ్డి ప్రవర్తించారు. అప్పుడు కూడా అధికార పార్టీల నాయకులకు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రులను గౌరవించడం ఇదేనా? భగ్గుమన్న బీజేపీ

కేంద్ర మంత్రులను గౌరవించడం ఇదేనా? భగ్గుమన్న బీజేపీ

ఇక ప్రస్తుతం కేంద్ర మంత్రులకు సైతం ప్రోటోకాల్ పాటించకుండా అవమానించడం పద్ధతేనా అని బిజెపి నేతలు మండిపడుతున్నారు.కేంద్ర మంత్రులను గౌరవించడం ఇదేనా? అని ఆలయ ఈఓ గీతారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, నాయకులు వస్తే రాచ మర్యాదలు చేస్తున్నారని, ఇక బిజెపి కి సంబంధించిన మంత్రులు వచ్చినా అగౌరవపరిచి ఇబ్బంది పెడుతున్నారు అంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు గుడికి రావొద్దా అంటూ మండిపడుతున్నారు.

 యాదాద్రి ఆలయ ఈవో పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

యాదాద్రి ఆలయ ఈవో పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్


అంతేకాదు కేంద్ర మంత్రులు, బిజెపి నేతలు ఈరోజు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారని తెలిసి ఆలయ హుండి లెక్కింపు కార్యక్రమం మొదలు పెట్టారని సైతం ఆరోపిస్తున్నారు. గతంలో ప్రోటోకాల్ విషయంలో భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు దిశానిర్దేశం చేశారని, అయినప్పటికీ ఆలయ అధికారుల తీరు మారడం లేదంటూ బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులను అవమానించిన యాదాద్రి ఆలయ ఈవో పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
A protocol dispute took place in Yadagirigutta. Union Ministers Gajendrasingh Shekawat and Kishan Reddy came to yadadri temple for darshan. E.O Geetha Reddy violated protocol. BJP leaders are angry on yadadri temple E.O.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X