మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ అసంతృప్తి

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్​ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతోన్న 22వ స్నాతకోత్సవంలో గవర్నర్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్‌​కు జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక స్వాగతం పలకకపోవడం గమనార్హం.

జిల్లా ఉన్నతాధికారులు రాకుండా ఆర్డీవో, డీసీపీ మాత్రమే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. తన ప్రొటోకాల్ గురించి మీరు గమనిస్తున్నారు కదా అంటూ గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, గతంలో కూడా గవర్నర్ తమిళిసై విషయంలో పలుమార్లు ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరిగిన విషయం తెలిసిందే.

protocol issue in governor tamilisai soundararajan warangal KU visit

అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని.. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్​ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవాలన్నారు గవర్నర్ తమిళిసై.

ఈ కార్యక్రమానికి గవర్నర్‌​తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఇంజినీరింగ్, టెక్నాలజీ పరిశోధన మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్‌ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 56 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేశారు. వీరితో పాటు 192 మందికి 276 బంగారు పతకాలను గవర్నర్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+