మర్మాంగాన్ని కోసిన సైకో: బాలికపై లైంగిక దాడి

నిజామాబాద్/ సిద్ధిపేట: నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సజ్జనపల్లి గ్రామం పర్మల్లా తండాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పోమ్యా అనే వ్యక్తిపై సైకో నారాయణ బ్లేడుతో దాడి చేశాడు. అతని మర్మాంగాన్ని కోసేశాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఈ సైకో నారాయణ ఓ వ్యక్తిపై దాడి చేసి చంపాడు. సైకో నారాయణకు స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
ఇదిలావుంటే, బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన తండ్రీకొడుకులపై, సహకరించిన కోడలి పైన సిద్దిపేట టూటౌన్ సీఐ సైదులు కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పొన్నాలకు చెందిన బాలిక (16) పాత బస్టాండ్ ఎదురుగా భిక్షాటన చేస్తుండగా కరీంనగర్ జిల్లా బాబుపేటకు చెందిన ద్యానవేయిన పోచయ్య (43) అతడి కోడలు సమ్మవ్వలు బాలికను గుడ్డతో నోటిని మూసి ఆటోలో కరీంనగర్ జిల్లా పెద్దపల్లి వద్దకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత చాయలో మత్తు మందు కలిపి పోచయ్య, అతడి కొడుకు నర్సింలు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు పెద్దపల్లి వద్దకు వెళ్లి బాలికను తీసుకొచ్చారు. బాలిక కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దీంతో వారు సిద్దిపేట టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోచయ్య, కొడుకు నర్సింలు, సహకరించిన కోడలు సమ్మవ్వల పై కిడ్నాప్, లైంగికదాడి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications