వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్ కల్చర్ హానికరంగా మారకూడదు.!బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లకు నగర సీపి సీవి ఆనంద్ దిశానిర్దేశం.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇటీవలికాలంలో మింక్ అండ్ పుడ్డింగ్ పబ్ ప్రాంగణంలో పోలీసులు చేపట్టిన తనిఖీలో కొకైన్ లభ్యత, పబ్బుల నుండి వెలువడే ధ్వనులు పరిమిత స్థాయి కంటే అధికంగా ఉండుట వలన పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నట్లు తరచు ఫిర్యాదులు అందడం, పబ్బులకు వచ్చే వారి వలన రహదారులపై పెరిగిన పార్కింగ్ రద్దీ, బార్లు మరియు పబ్బుల నుండి మద్యం తాగి బయటకు వచ్చిన వారు రహదారులపై వెళ్లే వారితో అసభ్యంగా ప్రవర్తించడం, బార్లు మరియు పబ్బులలో మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లుగా పోలీసులకు నివేదికల అందడం వంటి అంశాలపై హైదరాబాద్ సిపి సివీ ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

బార్, పబ్బుల యసమానులతో నగర కమీషన్ భేటీ.. రెస్టారెంట్ల తీరుపై సీపి దిశానిర్ధేశం

బార్, పబ్బుల యసమానులతో నగర కమీషన్ భేటీ.. రెస్టారెంట్ల తీరుపై సీపి దిశానిర్ధేశం

బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బుల యజమానులు మరియు డ్రైవ్-ఇన్ రెస్టారెంట్స్ యజమానులతో తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అనేక సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులకు సౌకర్యం కోసం తీసుకుంటున్న చర్యల వలన నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారన్నారు సీవీ ఆనంద్. హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలు, మహిళా సంరక్షణ, వేగవంతమైన క్లియరెన్స్ మరియు ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశాలకు విదేశీయులు ఆకర్షితులవుతున్నారని సీపి సీవీ ఆనంద్ స్పష్టం చేసారు.

మాదకద్రవ్యాలకు దూరండా ఉండండి.. పబ్, రెస్టారెంట్ల యజమానులకు కమీషనర్ మార్గదర్శకాలు

మాదకద్రవ్యాలకు దూరండా ఉండండి.. పబ్, రెస్టారెంట్ల యజమానులకు కమీషనర్ మార్గదర్శకాలు

అంతే కాకుండా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పెట్టుబడిదారులను అధికంగా ఆకర్షిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ నగరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది బార్లు మరియు పబ్బుల యజమానులు చిన్నపాటి లాభాల కోసం నిబంధనలను ఉల్లంఘించి నగరాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని సిపి ఆవేదన వ్యక్తం చేసారు. సమావేశానికి హాజరైన వారికి సిపి సిటీ పోలీస్ యాక్ట్ గురించి వివరిస్తూ, పోలీస్ యాక్ట్ నిబంధనల మేరకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వ్యాపారం కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

బార్లలోకి టీనేజర్లకు అనుమతి లేదు.. పబ్బుల్లో సౌండ్ నియంత్రించాలన్న కమీషనర్

బార్లలోకి టీనేజర్లకు అనుమతి లేదు.. పబ్బుల్లో సౌండ్ నియంత్రించాలన్న కమీషనర్

అంతేకాకుండా నిర్దేశించబడిన వయసు కన్నా తక్కువ వయస్సు గలవారిని పబ్బులోనికి అనుమతించవద్దని, ధ్వని స్థాయిలను పరిమితం చేయాలని కూడా సిపి ఆదేశించారు. 30 రోజుల బ్యాకప్‌తో కూడిన కూడిన సీసీటీవీల ఏర్పాటు మరియు ప్రాంగణంలో సౌండ్ ప్రూఫింగ్, వ్యాలెట్ డ్రైవర్లు, సిబ్బంది, కస్టమర్లను తరచుగా మానిటరింగ్ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరారు. రాత్రి 11 గంటల తరువాత వచ్చిన ఆర్డర్‌లను అంగీకరించరాదని మరియు 12 గంటలలోపు మూసివేయాలని సిపి స్పష్టం చేసారు. శుక్ర మరియు శనివారాలలో లావాదేవీలను లెక్కింపు లను దృష్టిలో పెట్టుకొని అరగంట గ్రేస్ పీరియడ్‌తో పాటు అదనంగా ఒక గంట మినహాయింపు అనుమతించబడుతుందన్నారు నగర సీపి సీవి ఆనంద్.

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలి.. అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్న నగర సీపి ఆనంద్

డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించాలి.. అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్న నగర సీపి ఆనంద్

అంతర్జాతీయ ప్రయాణికులు లేదా ప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని స్టార్ రేటింగ్ ఉన్న హోటళ్లలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంచబడుతుందని, అది సాధారణ ప్రజలకు కాదన్నారు. కాబట్టి 24 గంటలు మద్యం అందించే బార్లు, రెస్టారెంట్లు పబ్బులు ఇకపై అనుమతించబడవన్నారు నగర కమీషనర్.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతకు కట్టుబడి, త్వరలోనే సిటీ పోలీస్ వెబ్‌సైట్‌ ద్వారానే లైసెన్స్ పునరుద్ధరణలు మరియు ఇతర లైసెన్సుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆనంద్ హామీ ఇచ్చారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని సి వి ఆనంద్ పిలుపునిచ్చారు.

English summary
Hyderabad Police Commissioner C.V. Krishnan, who held a meeting with bar and restaurant, pub owners and drive-in restaurant owners in the conference hall of his office on Friday. Anand discussed many issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X