వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తనకు, తన కుటుంబానికి వాళ్ళతో ప్రాణహాని.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో పూరి జగన్నాథ్ ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. లైగర్ చిత్ర ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఆ చిత్ర ఎగ్జిబిటర్లు అయిన ఆడెపు శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శీను, సినిమా ఫైనాన్షియర్ శోభన్ బాబు అలియాస్ శోభన్ తనను వేధిస్తున్నారని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులను ఆశ్రయించిన పూరీ జగన్నాథ్

తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసులను ఆశ్రయించిన పూరీ జగన్నాథ్

తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని పూరిజగన్నాథ్ తన ఫిర్యాదు లేఖను తన వ్యక్తిగత సహాయకుడు అయిన శ్రవణ్ ద్వారా పోలీసులకు పంపించారు. పూరి జగన్నాథ్ తనపై, తన కుటుంబ సభ్యుల పై హింసకు పాల్పడేలా వరంగల్ శీను, శోభన్ ఇతరులను ప్రేరేపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో తెలిపారు.

నేడు పూరీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు

నేడు పూరీ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు

లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాథ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. పూరి జగన్నాథ్ కు చెందిన పూరి కనెక్ట్స్ ఎల్ఎల్ పి ఆధ్వర్యంలో పూరీ జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో లైగర్ సినిమాను నిర్మించారు. సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవహారంలో కాకతీయ ఎగ్జిబిటర్స్ నిర్వాహకుడైన వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12వ తేదీన ఒప్పందం చేసుకున్నారు. సినిమా నష్టాల పాలు కావటంతో ఎగ్జిబిటర్లు అంతా నేడు జూబ్లీహిల్స్లోని పూరీజగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు.

తన ఇంటిపై దాడి చేస్తారన్న పూరీ.. రక్షణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు

తన ఇంటిపై దాడి చేస్తారన్న పూరీ.. రక్షణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు

భారీ స్థాయిలో నష్టాలు రావడంతో డిస్ట్రిబ్యూటర్స్‌ తమకు కొంత డబ్బు వెనక్కు ఇవ్వాలని పూరి జగన్నాథ్ ను డిమాండ్‌ చేశారు. దీని కోసం పూరి ఒక నెల రోజులు గడువు కోరినప్పటికీ కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌ మాత్రం పూరి జగన్నాథ్ ఆఫీస్‌ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్‌ తన పరువు తీయాలని చూస్తే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వనని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈమేరకు ఓ ఆడియోకాల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా పూరీ జగన్నాథ్ తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో రక్షణ కోరుతూ పోలీసులకు లేఖ రాశారు.

పూరీ ఇంటి ముందు భారీ బందోబస్తు ..

పూరీ ఇంటి ముందు భారీ బందోబస్తు ..

ఇక ఈ వ్యవహారంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ఎగ్జిబిటర్లు సామాజిక మాధ్యమాల్లో జరిపిన చర్చ తాలూకు స్క్రీన్ షాట్ లను బెదిరింపు సందేశాలుగా పేర్కొని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. తాజా పరిణామాలతో పూరి జగన్నాథ్ ఇంటివద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక లైగర్ సినిమా వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుందో ..

ఆ నలుగురు ఎమ్మెల్యేలను మెచ్చుకున్న సీఎం కేసీఆర్; అత్యవసర భేటీ.. అర్ధరాత్రి దాకా కీలకచర్చలు!!ఆ నలుగురు ఎమ్మెల్యేలను మెచ్చుకున్న సీఎం కేసీఆర్; అత్యవసర భేటీ.. అర్ధరాత్రి దాకా కీలకచర్చలు!!

English summary
Director Puri Jagannath has complained in Jubilee Hills PS that he and his family are in danger from Warangal Srinu and Shobhan and that asked to give protection to them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X