వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషోత్తమ్ రెడ్డి లీలలు: ఫారిన్ లిక్కర్, వజ్రాల నగలు, అక్రమ పెంట్‌హౌస్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లొంగిపోయిన హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) డైరెక్టర్ (ప్రణాళిక) కె. పురుషోత్తమ రెడ్డి లీలలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి.

హైదరాబాదులోని సంపన్న వర్గాలు నివసించే బంజారాహిల్స్‌లోని ఓ పోష్ విల్లాపై అతను పెంట్‌హౌస్ నిర్మించినట్లు బయటపడింది. దానికి జిహెచ్ఎంసి అనుమతి కూడా లేదని ఎసిబి అధికారులు గుర్తించారు.

నెల రోజులు గాయబ్: విచారణలో దిమ్మ తిరిగే రిప్లై నెల రోజులు గాయబ్: విచారణలో దిమ్మ తిరిగే రిప్లై

ఇంటి తలుపులు తెరిచి చూసి...

ఇంటి తలుపులు తెరిచి చూసి...

ఎసిబి అధికారులు ఆదివారంనాడు బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో ఉన్న పురుషోత్తమ రెడ్డి ఇంటి తలుపులు తీసి సోదాలు చేశారు. వారు అక్రమ పెంట్‌హౌస్‌ను గుర్తించడమే కాకుండా ఆబ్కారీ చట్టానికి విరుద్ధంగా ఉన్న విదేశీ మద్యం సీసాలను కూడా కనిపెట్టారు. అనుమతిని మంచి విదేశీ మద్యం సీసాలను కలిగి ఉన్నందుకు అతనిపై ఎక్సైడ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విడిగా కేసు నమోదు చేశారు.

వజ్రాలు పొదిగిన నగలు, బంగారం

వజ్రాలు పొదిగిన నగలు, బంగారం

సోదాలు నిర్వహించి ఎసిబి అధికారులు వజ్రాలు పొదిగిన నగలను, ఓ కిలో బంగారాన్ని కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెండి నగలను కూడా సీజ్ చేశారు. వాటి విలువ 50 లక్షల రరూపాయల దాకా ఉంటుందని భావిస్తున్నారు. 1.05 లక్షల నగదు, 9000 రూపాయల విలువ చేసే రద్దయిన నోట్లు, 501 డాలర్లు, 50 లక్షల దీనారాలు కూడా ఎసిబి అధికారుల చేతికి చిక్కాయి. 20 లక్షల రూపాయల విలువ చేసే చీరలను కూడా వారు సీజ్ చేశారు. విదేశీ మద్యం ఖరీదు 70 వేల రూపాయలు ఉంటుందని అంచనా.

బిడ్డ పెళ్లికి 40 లక్షల మద్య.

బిడ్డ పెళ్లికి 40 లక్షల మద్య.

యుఎఈ, సింగపూర్, అమెరికాల నుుంచి దిగుమతి చేసుకున్న, స్థానికంగా తయారు చేిసన 14 మద్యం సీసాలను ఎసిబి అధికారులు సీజ్ చేశారు. 2016 నవంబర్‌లో జరిగన తన కూతురు పెళ్లిలో 4 లక్షల విలువ చేసే మద్యాన్ని పారించాడు.

ఇంటికి ఇలా పర్మిషన్

ఇంటికి ఇలా పర్మిషన్

2004-05లో జిహెచ్ఎంసి పురుషోత్తమ్ రెడ్డి భార్య విజయారెడ్డి పేరు మీద జి+1తో విల్లా నిర్మాణఆనికి అనుమతి ఇచ్చింది. విల్లా సాగర్ సొసైటీలో 500 చదరపు గజాల్లో విస్తరించి ఉంది. జిహెచ్ఎంసి పర్మిషన్ లేకుండా పెంట్‌హౌస్ నిర్మించారు. లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇవి రెండు పర్మిషన్ ఇచ్చినప్పటి ప్లాన్‌లో లేవు

English summary
HMDA director, planning, K Purushottam Reddy has constructed a penthouse on the terrace of his posh villa in Banjara Hills without permission of GHMC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X