సీసీటీవీ ఫుటేజీల్లో దొరికిన అల్లు అర్జున్
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తొమ్మిదేళ్ల బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండట్లేదు. ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు.

రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించిన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమని అన్నారు. ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని, ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.
ఈ ప్రెస్ మీట్ తరువాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్.. ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు.
సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులెవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు.
మొత్తంగా రెండు సీసీటీవీ ఫుటేజీలు విడుదల అయ్యాయి. ఒకదాని నిడివి 33 సెకెన్లు, మరొకటి 54 సెకెన్లు. పోలీసులతో పాటు ఆయన వ్యక్తిగత బౌన్సర్లు స్వయంగా ఆయనను బయటికి తీసుకుని రావడం రెండో ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. అల్లు అర్జున్‌తో పాటు హీరోయిన్ రష్మిక కూడా ఇందులో కనిపించారు.












Click it and Unblock the Notifications