బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోకి కొండ చిలువ, పోలీసుల పరుగు
హైదరాబాద్: భాగ్యనగరంలో కొండ చిలువ కనిపించింది. అది కూడా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో. కాంక్రీట్ నగరమైన హైదరాబాదులో 24 గంటలు జనాలు మెదులుతూనే ఉంటారు. ఇలాంటి జనావాసంలోకి రోడ్లు, బిల్డింగులు దాటి కొండ చిలువ వచ్చింది.
ఆ కొండ చిలువ ఆరు అడుగుల నుంచి పది అడుగుల మధ్య ఉంది. కొండ చిలువ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం కావడంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు. వారు స్నేక్ ఫర్ ఫ్రెండ్స్ స్వచ్చంధ సంస్థ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడకు చేరుకొని కొండ చిలువను బంధించారు. సమీపంలోని కేబీఆర్ పార్కు నుంచి కొండ చిలువ వచ్చి ఉంటుందని పోలీసులు చెప్పారు. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని చెబుతున్నారు.













Click it and Unblock the Notifications