Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీలకు షాక్: ఉద్యోగాల కల్పన తగ్గుదల, స్కిల్స్ పెంచుకోవాల్సిందే

కొత్త ఉద్యోగుల నియామాకం విషయంలో ఐటీ పరిశ్రమ ఆచితూచి అడుగులేస్తోంది. ఆటోమేషన్, డిజిటల్, క్లౌడ్, ఆర్టిపిషీయల్ ఇంటలిజెన్స్ దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగుల నియామాకాల్లో వేగాన్ని తగ్గిస్

హైదరాబాద్: కొత్త ఉద్యోగుల నియామాకం విషయంలో ఐటీ పరిశ్రమ ఆచితూచి అడుగులేస్తోంది. ఆటోమేషన్, డిజిటల్, క్లౌడ్, ఆర్టిపిషీయల్ ఇంటలిజెన్స్ దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగుల నియామాకాల్లో వేగాన్ని తగ్గిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న మార్పుల కారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో అనేక మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి. దీంతో ఐటీ పరిశ్రమ మందగమనంలో కొనసాగుతోంది.

ఉన్న ఉద్యోగులతోనే కొనసాగించుకోవాలనే అభిప్రాయంతో ఐటీ పరిశ్రమలున్నాయి. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశీయ ఐటీ పరిశ్రమలపై ఈ ప్రభావం తీవ్రంగా కన్పిస్తోంది.

దీంతో ఖర్చులను తగ్గించుకొనేందుకే ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నాయి. అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడ అవలంభిస్తున్న విధానాలు ఇందుకు కారణంగా మారాయి.

టీసీఎస్, ఇన్పోసిస్‌ల్లో ఉద్యోగుల తగ్గుదల

టీసీఎస్, ఇన్పోసిస్‌ల్లో ఉద్యోగుల తగ్గుదల

టీసీఎస్, ఇన్సోసిస్ సంస్థలు ఇటీవలే ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెందిన తొలి త్రైమాసిక ఫలితాల్లో ఉద్యోగుల తగ్గుదల స్పష్టంగా కన్పిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్వార్టర్ 1 లో టీసీఎస్ 11,202 మందిని నియమించుకొంది. అయితే ఈ సంస్థనుండి 12,616 మంది బయటకు వెళ్ళారు. 1,414 మంది తగ్గాయి.ఈ ఏడాది ఉద్యోగాల కల్పన తక్కువగానే ఉండే అవకాశం ఉందని కంపెనీ ప్రకటించింది. ఇక ఇన్పోసిస్ విషయంలో 1,811 ఉద్యోగాలు తగ్గాయి. రిక్రూట్‌మెంట్‌లో వృద్ది తగ్గుముఖం పట్టినట్టు ఆ కంపెనీ ప్రకటించింది.

ఐటీ రంగాన్ని ఇబ్బందిపెడుతున్న క్లయింట్లు

ఐటీ రంగాన్ని ఇబ్బందిపెడుతున్న క్లయింట్లు

దేశీయ ఐటీ కంపెనీలకు ప్రధానంగా బ్యాంకులు, రిటైల్ ఇంధన రంగాల నుండి ఎక్కువగా ఆర్ఢర్లు వస్తుంటాయి.అయితే ఈ రంగాలు మందగమనంలో ఉండడం కూడ ఐటీ రంగాన్ని ఇబ్బందిపెడుతోంది.దేశం నుండి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ 117 బిలియన్ డాలర్లుంటే ఇందులో ఐదోవంతు టీసీఎస్, ఇన్పోసిస్ మాత్రమే చేస్తున్నాయి. ఆటోమేషన్ ప్రభావం కారణంగా కిందిస్థాయి ఉద్యోగుల అవసరాలు తగ్గిపోతున్నాయి.

Recommended Video

    Good News for Techies Find Out More
    స్కిల్స్ పెంచుకోవాల్సిందే

    స్కిల్స్ పెంచుకోవాల్సిందే

    మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టెక్కీలు తమ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరాలు ఏర్పడ్డాయి. డిజిటల్ క్లోడ్ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటినుండి తీసుకోవడం కష్టమనే అభిప్రాయంతో కొన్ని సంస్థలున్నాయి.అందుకే తమ ఉద్యోగులకే శిక్షణ ఇచ్చేందుకు ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం కూడ ఐటీ పరిశ్రమ లాభాలను దెబ్బతీసింది.

     1.5 కొత్త ఉద్యోగాలు నాస్కామ్ అంచనా

    1.5 కొత్త ఉద్యోగాలు నాస్కామ్ అంచనా

    ఈ ఏడాది కొత్తగా 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు నాస్కామ్ అంచనావేసింది. అయితే ఉద్యోగాల సంఖ్య 38.5 లక్షలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 2016-17 లో 1.73 లక్షలు, అంతకుముందు ఏడాది 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించారు. ఈ ఏడాది భారత్ ఐటీ ఎగుమతుల వృద్ది అంచనాలను నాస్కామ్ తగ్గించడం ఐటీ పరిశ్రమ మందగమనానికి అద్దంపడుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+