కృష్ణయ్య టిడిపి ఎమ్మెల్యేనే: బాబుపైనా బాణం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ శానససభ్యుడు ఆర్. కృష్ణయ్య తమ పార్టీ అధ్యక్షుడు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును మాత్రమే కాకుండా చంద్రబాబును కూడా ఆయన తప్పు పట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ బీసీ బిల్లుపై మాట్లాడటం లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన బీసీ బిల్లుకు మద్దతుగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, మూడు ఎకరాల భూ పంపిణీ పథకాలను బీసీలకూ వర్తింపజేయాలన్నారు. బీసీ సమస్యలపై మే 5, 6, 7వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు కృష్ణయ్య తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గానికి సమన్వయకర్తను నియమించాలని టీడీపీ అధిష్టానాన్ని తానే కోరానని కృష్ణయ్య తెలిపారు.
బీసీల సమస్యలపై మే 5, 6, 7 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే, బీసీసంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. బీసీ బిల్లుకు మద్ధతుగా అన్ని పార్టీలు కేంద్రానికి లేఖలు రాయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications