వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే టీఆర్ఎస్ తెలంగాణలో మూడోసారి గెలిచి చూపించాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఛాలెంజ్

|
Google Oneindia TeluguNews

బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన పై, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి హరీష్ రావు తనపై, బీజేపీ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారంలో హరీష్ రావు స్థాయిని దిగజార్చుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు.

Recommended Video

TRS ప్రభుత్వానికి BJP ఎమ్మెల్యే రఘునందన్ రావు ఛాలెంజ్ *Telangana | Telugu OneIndia
 హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడిన రఘునందన్ రావు

హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడిన రఘునందన్ రావు


దుబ్బాక నియోజక వర్గంలో 57 వేల ఇళ్లలో పెన్షన్ ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పిన వ్యాఖ్యలు అబద్ధమని రఘునందన్ రావు పేర్కొన్నారు.
దుబ్బాక నియోజక వర్గంలో ఉన్న మొత్తం ఇళ్ళు 50,000 అయితే, 57 వేల ఇళ్లలో ఎలా పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన సమయంలో ఆదాయం ఎంత, ఖర్చు ఎంత.. ప్రస్తుతం ఆదాయమెంత? ఖర్చు ఎంత అనేది మంత్రి చెప్పగలరా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి

రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి


దమ్ముంటే తెలంగాణ, ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాక నియోజకవర్గం లో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కాకుండా ఎవరు తిరగాలో చెప్పాలని ప్రశ్నించిన రఘునందన్ రావు, ఎమ్మెల్యే రిబ్బన్ కత్తిరించడానికి మాత్రమే తిరుగుతున్నాడు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి అన్నారు. దుబ్బాక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఇంకా టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు.

 గెలవకుంటే దుబ్బాకను అభివృద్ధి చెయ్యరా? ప్రశ్నించిన రఘునందన్ రావు

గెలవకుంటే దుబ్బాకను అభివృద్ధి చెయ్యరా? ప్రశ్నించిన రఘునందన్ రావు


టిఆర్ఎస్ గెలవకుంటే దుబ్బాకను అభివృద్ధి చెయ్యరా అని ప్రశ్నించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఇది సంస్కృతి కాదంటూ మండిపడ్డారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలు అందిస్తూ, అదేదో తాము చేసినట్టు గొప్పలు చెప్పుకోవడం ఎందుకంటూ రఘునందన్ రావు ప్రశ్నించారు. మూడు సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ చదువుకున్న స్కూలు కూడా అభివృద్ధి లేక అలానే ఉందని, అభివృద్ధి చేసి దమ్ముంటే సీఎం తో ప్రారంభించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు.

 దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలి : రఘునందన్ రావు సవాల్

దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలి : రఘునందన్ రావు సవాల్


టిఆర్ఎస్ నాయకులు దమ్ముంటే తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి గెలిచి చూపించాలని రఘునందన్ రావు ఛాలెంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నా, కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని రఘునందన్ రావు స్పష్టం చేశారు.

English summary
BJP MLA Raghunandan Rao challenged the TRS to win the third term in Telangana if they dare. Minister Harish Rao's comments made him angry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X