కేసీఆర్, మోడీపై రాహుల్ విమర్శలు: పెద్దాపూర్‌లో కార్నర్ మీటింగ్, జోరుగా జోడో యాత్ర

హైదరాబాద్: దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా మెదక్ జిల్లా పెద్దాపూర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు. రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ జోడో యాత్రలో ముందుకెళ్తున్నామన్నారు.

దేశంలో ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్య ఎప్పుడూ చూడలేదన్నారు రాహుల్ గాంధీ. 2014 తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేశారని విమర్శిచారు. ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

Rahul Gandhi hits out at modi and kcr in bharat jodo yatra held in Medak district

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. తెలంగాణలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారని సీఎం కేసీఆర్‌పై రాహుల్ మండిపడ్డారు. కేంద్రం తేవాలనుకున్న రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని రాహుల్ గుర్తు చేశారు.

గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగినా ప్రధాని మోడీ మౌనంగా ఉన్నారని రాహుల్ మండిపడ్డారు. విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నానని రాహుల్ చెప్పారు. ప్రజల ప్రేమ, అప్యాయతతో తనకు అలసట రావడం లేదని చెప్పుకొచ్చారు.

రాహుల్ వెంట తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, తదితర నాయకులు, కార్యకర్తలు భారీస్థాయిలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+