రేవంత్‌కు ఎడమచేత్తో స్వీటిచ్చిన రాహుల్: నెటిజన్లు ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ రేవంత్‌రెడ్డికి స్వీట్ తినిపించారు. అయితే ఎడమ చేతితో రేవంత్‌కు రాహుల్‌ స్వీట్ తినిపించడంపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మనస్పూర్తిగా రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించలేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. రాహుల్‌గాంధీ రేవంత్‌కు స్వీట్ తినిపించే ఫోటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే, కుడి చేత్తో కాకుండా, ఎడమ చేత్తో రాహుల్ స్వీట్ తినిపించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Rahul gandhi offered revanth to sweet with left hand

కష్టపడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ కు. రాహుల్ గాంధీ ఎలాంటి బహుమతి ఇచ్చాడో చూడండి అంటూ ఒక నెటిజన్ స్పందించాడు. ఎడమ చేత్తో స్వీట్ పెట్టాడంటే, మీకు హ్యాండ్ ఇచ్చినట్టే అంటూ మరొకరు స్పందించారు.

ఎడమ చేత్తో స్వీట్ పెడుతున్నాడంటే అది విషంతో సమానమని, మిమ్మల్ని రాహుల్ మనస్పూర్తిగా పార్టీలోకి ఆహ్వానించలేదని మరొకరు కామెంట్ చేశారు. ఇలా పలువురు పలురకాలుగా కామెంట్ చేస్తున్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Revanth reddy along with followers joined in Congerss on Tuesday at Delhi. Rahulgandhi offered Revanth to sweet with left hand. netizens intresting comments about this photo.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి