వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ పరుగు.. ఆయన వెనుక రేవంత్ రెడ్డి: వీడియో వైరల్.. పేలుతున్న సెటైర్లు!!

|
Google Oneindia TeluguNews

ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ తన 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా పరుగు తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. తన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పిల్లలతో కలిసి హఠాత్తుగా పరుగు తీయటంతో, ఆయన భద్రతా సిబ్బంది, ఆయన వెనుక రేవంత్ రెడ్డి కూడా పరుగులు తీశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు ప్రతిపక్షాలకు, నెటిజన్ లకు ఆయుధంగా మారింది.

రాహుల్ గాంధీ పరుగు వీడియో వైరల్, మొదలైన ట్రోల్స్

గత 5 రోజులుగా తెలంగాణా రాష్ట్రంలో పాదయాత్ర సాగిస్తున్న రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా ఊహించని విధంగా చేసిన పరుగు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. దేశంలో రాజకీయాలలో నిలబడలేక రాహుల్ గాంధీ భాగో యాత్ర చేపట్టారని ట్రోల్ చేస్తున్నారు. ఇక మునుగోడు ఉపఎన్నికలో గెలిస్తే ఏంటి గెలవక పోతే ఏంటి నేను మాత్రం ఇంతే అంటూ వ్యాఖ్యలు చేస్తూ మరికొందరు రాహుల్ గాంధీ పరుగు ను టార్గెట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వెనుక రేవంత్ రెడ్డి పరిగెత్తడాన్ని కూడా ట్రోల్ చేస్తున్న మరికొందరు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఇది అంటూ ట్రోల్ చేస్తున్నారు. పాపం రేవంత్ రెడ్డి కి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ట్రోల్ చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పట్టింపే లేదంటూ సెటైర్లు

ఇక తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు రాహుల్ గాంధీ చాలా సరదాగా భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్గత కలహాలతో కొట్టుకు చస్తుంటే, ఒకపక్క మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేక నానా అగచాట్లు పడుతుంటే, ఆయన మాత్రం కూల్ గా, సరదాగా పరుగులు పెడుతున్నారని రాహుల్ గాంధీ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డిని కూడా రాహుల్ గాంధీ పరుగులు పెట్టిస్తున్నారని రకరకాలుగా ట్రోల్ చేస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు.

ఇప్పటి నుండే రాహుల్ భాగో యాత్ర అంటూ వ్యంగ్యాస్త్రాలు

ఇక మరికొందరు త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ పారిపోవడానికి తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్టు సెటైర్లు వేశారు. మరికొందరు రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ దెబ్బకు అమేథీ నుండి వాయనాడ్ కు ఇదే వేగంతో పరుగులు పెట్టాడని సెటైర్లు వేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర కాదు, ఇది ఆయన భాగో యాత్ర అని చెప్తున్నారు. ఇక మరికొందరు ఎక్కడికి పారిపోతున్నారు రాహుల్ బాబా.. వెనక మోడీ ఉన్నారా అంటూ మోడీని చూసి రాహుల్ గాంధీ భయపడి పారి పోతున్నట్టు ట్రోల్ చేస్తున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలు

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను టార్గెట్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలు


ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడులోని కన్యాకుమారి నుండి 3570 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్న లక్ష్యంగా మొదలైంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఐదు నెలల పాటు కొనసాగుతుంది. 12 రాష్ట్రాల ను కవర్ చేస్తూ శ్రీనగర్లో ముగిస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను టార్గెట్ చేసి మండిపడుతున్నారు. అయితే ఆయన భారత్ జోడో యాత్రలో ఆయన తీరును టార్గెట్ చేసి ప్రత్యర్థి పార్టీలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయి.

English summary
Rahul Gandhi's run as part of Bharat Jodo Yatra has now gone viral on social media. Netizens are targeting Revanth Reddy running behind him. With this, satires on Rahul Gandhi are exploding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X