స్పా ముసుగులో వ్యభిచారం: ముగ్గురి అరెస్టు, ఇద్దరు యువతులకు విముక్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. హైదరాబాదులోని మాదాపూర్‌ అరుణోదయ కాలనీలో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచరం మేరకు ఎస్‌వోటీ పోలీసులు బుధవారం దాడి చేశారు.

పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేసి, ఇద్దరు యువతులకు విముక్కి కలిగించారు. అరుణోదయ కాలనీలో రెయిన్‌స్పా పేరుతో సెలూన్‌ను విష్ణు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. స్పా ముసుగులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మస్కాకుతు(24), ముంబైి చెందిన షాబనూర్‌(23), గుజరాత్‌కు చెందిన అకీర్‌(24) మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు..

సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి ముగ్గురు యువకులతో పాటు విటులు అభిషేక్‌, ప్రతాప్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు సెల్‌ఫోన్లు, రూ. 7,090 స్వాధీనం చేసుకొని నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు. 

నిర్వాహకుడు విష్ణు పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ మన్మథరావు తెలిపారు.అరెస్టు చేసినవారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Special Operations Teams of Madhapur on Wednesday conducted a raid at a brothel, Rain Spa, in Ayyappa Society and rescued two girls and took three persons into custody.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి