వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ-టి ఆశలు, రైల్వే బడ్జెట్‌కు ముందు విశాఖలో ఉద్రిక్తం: కొన్ని ఆసక్తికర అంశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్ 2016ని ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఏం ఇస్తారనే చర్చ సాగుతోంది. రైల్వే బడ్జెట్ పైన తెలంగాణ ప్రభుత్వం భారీగానే ఆశలు పెట్టుకుంది.

కేంద్రమంత్రి, తెలంగాణ నేత బండారు దత్తాత్రేయ, ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నో విజ్ఞప్తులు చేశారు. అవి ఎంత వరకు సఫలమౌతాయో చూడాలి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తుందా? కొత్త డిమాండ్ల పైన కరుణిస్తారా? ఈ రోజు తేలనుంది.

రాష్ట్రంలో రెండు మార్గాలను డబులింగ్‌, ట్రిపులింగ్‌గా విస్తరించనున్నట్లు గతసారి ప్రకటించి, సుమారు రూ.74 కోట్లు మంజూరు చేశారు. కానీ, ఆ పనులు ఇంకా టెండర్ల దశకు చేరలేదు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌-యాదగిరిగుట్టలను రైలుమార్గం ద్వారా అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు.

నాంపల్లి స్టేషన్ ఆధునికీకరణ పెండింగులోనే ఉంది. కాచికూడ స్టేషన్ విస్తరణకు ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో టెర్మినళ్ల నిర్మించాల్సి ఉంది. ఎంఎంటిఎస్ రెండోదశ పూర్తి చేయాల్సి ఉంది. కాగజ్ నగర్ - సికింద్రాబాద్ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌కు డిమాండ్

కాజీపేటను రైల్వే డివిజన్‌గా ప్రకటించాలనీ, పెండింగ్‌ ప్రాజెక్టులకు రైల్వే బడ్జెట్‌లో రూ.2,500 కోట్లు కేటాయించాలని దత్తాత్రేయ కూడా సురేష్‌ ప్రభూకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలూ కొన్ని ప్రతిపాదనలు చేశారు.

Railway Budget 2016: What to expect Telangana from this Railway Budget

పెద్దపల్లి- కరీంనగర్‌- నిజామాబాద్‌, మేళ్లచెరువు- విష్ణుపురం మార్గాల పనులు నడుస్తున్నాయి. పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గంలో పూర్తయిన మేరకు గూడ్స్‌ రైళ్ల రాకపోకలకు ఇటీవల అనుమతించారు. మరో 14 కిలోమీటర్లను నిర్మించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే, నిజామాబాద్‌-కరీంనగర్‌ మీదుగా ముంబై, ఢిల్లీలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది.

మేళ్లచెరువు - విష్ణుపురం మార్గంలో మరో 19 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. ఈ మార్గం పూర్తయితే తెలుగు రాష్టారాలైన తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ రాజధానుల మధ్య మరో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడుతుంది. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఇప్పటికే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. ఎంఎంటీఎస్‌ రైళ్లకు కాగితం రహిత టికెట్‌ విధానాన్ని అమలు చేశారు.

కాజీపేటలో వ్యాగన్‌ ఫ్యాక్టరీ నిర్మాణ ప్రతిపాదన ఇంకా కొలిక్కి రాలేదు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించినా, మరికొంత స్థలాన్ని కేటాయించాల్సి ఉంది.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో కాజీపేటను ప్రత్యేక డివిజన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. తెలంగాణ ఏర్పాటుతో దీనికి ప్రాధాన్యం పెరిగింది. దీనిని డివిజన్‌గా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా గతంలో పలుసార్లు కేంద్రాన్ని కోరారు.

ఏపీలో ఎన్నో ఏళ్లుగా పలు డిమాండ్లు

కృష్ణా - వికారాబాద్ లైన్ మూలన బడింది,
కృష్ణా - వికారాబాద్ లైన్ ఏళ్ల తరబడి మూలనబడింది.య
కామాఖ్య, చెన్నై, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లను విశాఖ మళ్లించాలని విజ్ఞప్తి.
విశాఖ స్టేషన్లో లిఫ్టులు, బ్యాటరీలు లేఖ అవస్థలు.
విజయవాడ - సికింద్రాబాద్ మధ్య డబుల్ డెక్కర్ రైలు నడపాలని చాలా రోజులుగా డిమాండ్.
విశాఖ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాంలు పెంచాలని డిమాండ్.
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలు మార్చి వేగం పెంచాలని డిమాండ్
విశాఖ - వారణాసి, విశాఖ - చెన్నైల రైళ్లు ప్రతిరోజు కావాలని డిమాండ్.
సర్వేచేసి పాతిక ఏళ్లయినా మాచర్ల - గద్వాల రైల్వే లైన్ పూర్తి కాలేదు.
విజయవాడ, గుంటూరు నుంచి బెంగళూరు సర్వీసులకు ఎదురుచూపు
విశాఖ రైల్వే జోన్ కోసం డిమాండ్.
గుంటూరు - షిర్డీ డెయిలీ సర్వీస్ కోసం డిమాండ్
విశాఖ - అరకు మధ్య అద్దాల రైలు కోసం ఎదురుచూపు.
విశాఖలో వ్యాగన్ల తయారీ కేంద్రం కోసం డిమాండ్

విశాఖలో ఉద్రిక్తం

రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టే కొద్ది గంటల ముందు విశాఖలో ఉద్రిక్తత ఏర్పడింది. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జెఏసి ఆందోళనకు దిగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

భారతీయ రైల్వేలకు సంబంధించిన ఆసక్తికర కొన్ని విషయాలు...

భారత్‌లో అత్యంత వేగంగా నడిచే రైలు ఢిల్లీ నుంచి భోపాల్‌కు ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్. సగటున 91 కి.మీ.

వేగంతో ప్రయాణించే రైలు ఢిల్లీ, ఆగ్రా మధ్య 150 కి.మీ వేగంతో వెళ్తుంది.

అత్యంత నిదానంగా నడిచే రైలు నీలగిరి ఎక్స్‌ప్రెస్. పర్వతాల మధ్య తిరిగే ఈ రైలు సగటు వేగం కేవలం 10

కి.మీ.

డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణించే వివేక్ ఎక్స్ ప్రెస్ 4,273 కి.మీ ప్రయాణిస్తుంది. భారత్‌లో

అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఇది. ఇక నాగపూర్-అజ్ని మధ్య ఉన్న 3 కి.మీ. రైలు మార్గం అతి తక్కువది.

త్రివేండ్రం నుంచి నిజాముద్దీన్ ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్ వడోదర నుంచి కోటా మధ్య 528 కి.మీ. దూరం

ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తుంది. హౌరా-అమృతసర్ ఎక్స్‌ప్రెస్ 115 స్టేషన్లలో ఆగుతుంది.

మహారాష్ట్రలో శ్రీరాంపూర్, బెలాపూర్... ఈ రెండు స్టేషన్లూ ఒకేచోట ఇవి ఉంటాయి. వీటిని వేరు చేసేది ప్లాట్ ఫాం

మాత్రమే.

భారత్‌లో అసలు సమయపాలన పాటించని రైలు గౌహతి - త్రివేండ్రం ఎక్స్ ప్రెస్. వాస్తవ సమయానికన్నా ఈ రైలు

10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంటుంది.

అరక్కోణం నుంచి రేణిగుంట మధ్య చెన్నైకి సమీపంలో ఉన్న వెంకటనరసింహరాజువారిపేట అతి పొడవైన రైల్వే

స్టేషన్ పేరు కాగా, గుజరాత్‌లోని ఆనంద్ వద్ద ఓడ్ పేరిట, ఒడిశాలో ఇబ్ పేరిట రెండు పొట్టి పేర్లను కలిగివున్న

స్టేషన్లు ఉన్నాయి.

1855లో తయారైన స్టీమ్ ఇంజన్ ఫెయిరీ క్వీన్ ఇప్పటికీ నడుస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటికీ సేవలందిస్తున్న

అత్యంత పురాతన రైలింజన్ ఇది. జమ్మూకాశ్మీర్‌లోని పీర్ పంజాల్ టన్నెల్ దేశంలో అతి పెద్దది. దీని పొడవు 11.215 కి.మీ. గోరఖ్‌పూర్ జంక్షన్ అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాంను కలిగివుంది. దీని పొడవు 1.35 కి.మీ.

English summary
The Railway Budget is expected to focus on capacity creation in the rail sector with an increased outlay of about Rs.1.25 lakh crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X