సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్దరణపై బిగ్ అప్డేట్..!!

సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ ప్రయాణీకులకు సమస్యగా మారింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పలు ప్రధాన రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించారు. ఈ మళ్లించిన రైళ్ల పైన స్పష్టత లేక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతున్నారు. చర్లపల్లి నుంచి ప్రధాన రైళ్ల మార్పు ప్రయాణీకులు స్టేషన్ కు చేరుకోవటమే సమస్యగా ఉంది. ఇదే సమయంలో తిరిగి రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించటం పైన స్పష్టత వస్తుంది. ఇక, చర్లపల్లి నుంచి రైళ్ల వివరాల పైన క్లారిటీ ఇచ్చారు.

ప్రయాణీకుల కష్టాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ అవసరమే అయినా.. ప్రయాణీకుల విషయంలో తగిన విధంగా రైళ్ల రాకపోకల పైన కసరత్తు చేయలేదనేది స్పష్టం అవుతోంది. అనేక రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడకి మళ్లించారు. ఏ రైలును ఎటు మళ్లించారో తెలియక ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిత్యం 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆరు జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. 113 రోజుల పాటు అత్యధిక ప్లాట్‌ఫామ్‌లను మూసేస్తుండటంతో ఆరవై జతల రైళ్లు బయలుదేరే టెర్మినళ్లను మార్చుతున్నారు.

railway-officials-clarifies-on-resume-of-train-services-from-secunderabad

మళ్లించిన రైళ్లు
సికింద్రాబాద్ స్టేషన్ లో తొలుత 5, 6 ప్లాట్‌ఫారమ్‌లు ఆ తరువాత రెండేసి చొప్పున మూసేసి పనులు కొనసాగించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా చర్లపల్లి టెర్మినల్‌కు 20, కాచిగూడకు 2, నాంపల్లి (హైదరాబాద్‌)కు 2, మల్కాజిగిరికి 4, ఉందానగర్‌కు 2 రైళ్లను మార్చారు. ఇక, చర్లపల్లి మీదుగా నిత్యం 17 రైళ్లు, 9 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం మళ్లించిన రైళ్లతో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లింగంపల్లి - కాకినాడ టౌన్, లింగంపల్లి-విశాఖపట్టణం, తిరుపతి - ఆదిలాబాద్, కాజిపేట - హదాప్సర్, సంబల్‌పూర్‌- నాందేడ్, విశాఖపట్టణం -నాందేడ్, వాస్కోడిగామా - జస్‌దిహ్, నర్సాపూర్‌ - నాగర్‌సోల్, మచిలీపట్నం - సాయినగర్‌ షిర్డీ, విశాఖపట్నం - ఎల్‌టీటీ ముంబయి రైళ్లను మళ్లించారు.

ఆగస్టు వరకు

ఈ రైళ్లతో పాటు చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను అదనపు స్టాపేజీగా చేర్చారు. సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్, గుంటూరు - సికింద్రాబాద్‌ రైళ్లు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లోనే ఆగుతాయి. దీంతో 30,000 వరకు ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంది. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయి అప్రోచ్‌ రోడ్లు సిద్ధం కాలేదు. మల్లాపూర్‌ మార్గంలో ప్రతి నలభై నిముషాలకు, మహాలక్ష్మినగర్‌ వైపు ప్రతి పది నిముషాలకో బస్సు నడుపుతున్నట్లు టీజీఎస్​ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే, తిరిగి ఆగస్టు వరకు సికింద్రాబాద్ స్టేషన్ లో పూర్తి స్థాయిలో రైళ్లు రాకపోకలు సాగించే పరిస్థితి కనిపించటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+