సికింద్రాబాద్ స్టేషన్ లో కీలక మార్పులు - ఎంట్రీ, ఎగ్జిట్లు..!!
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్థి పనుల వేళ ప్రయాణీకులకు కీలక సూచనలు చేస్తున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణీకులు సికింద్రాబాద్ నుంచి రాక పోకలు సాగిస్తూ ఉంటారు. సికింద్రాబాద్ స్టేషన్‌కు రూ.720 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తోంది. అమృత్‌భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ రాకపోకల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనుల్లో భాగంగా ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు సూచనలు జారీ చేసింది. ఉత్తరం వైపు ఉన్న స్టేషన్ భవనం కూల్చివేత, కొత్త నిర్మాణం నేపథ్యంలో ప్రవేశ, ఎగ్జిట్ మార్గాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై గణేష్ ఆలయం పక్కన వద్ద కొత్త ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు. టికెట్, విచారణ కౌంటర్లతో పాటు 750 మంది ప్రయాణికులకు సరిపోయేలా కొత్త వెయిటింగ్ హాల్ సౌకర్యం కల్పించారు. గేట్ నంబర్ 4 మూసివేసినందున స్వాతి హోటల్ ఎదురుగా వద్ద అదనపు ప్రవేశద్వారం ఏర్పాటు చేశారు.

అదే విధంగా ప్లాట్‌ఫామ్ నంబర్ 10లో గేట్ నంబర్ 8 (బోయిగూడ వైపు) వద్ద టికెట్ కౌంటర్‌తో పాటు మరో కొత్త ప్రవేశం ద్వారం ఏర్పాటు చేశారు. స్టేషన్‌లో ఎంట్రీ/ఎగ్జిట్ మార్గాలు, ప్లాట్ ఫారా లను గుర్తించడానికి, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. రైళ్లు వచ్చే ఫ్లాట్ ఫారాల వివరాలను ముందుగానే ప్లాట్‌ఫారమ్ 1, 10లో ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి అదనపు సిబ్బందిని నియమించారు. ఆధునికీకరణ కోసం పనులు జరుగుతున్న నేపథ్యంలో పురాతన కట్టడాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications