వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.10,700 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టులు: తెలుగు రాష్ట్రాలకు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రూ.10,700 కోట్ల కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు పచ్చజెండా ఊపింది. మరో పది రోజుల్లో 2016-17 రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు రైల్వే లైన్ల ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం అనుమతులు మంజూరు చేసింది.

పెరిగిన ప్రయాణికుల, రవాణా అవసరాలను తీర్చేందుకు వీటిని అంగీకరిస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ.10,700 కోట్లు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క ప్రాజెక్టు లేదు.

ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ.1,294.13 కోట్లతో హుబ్లీ-చికాజూర్ మధ్య 190 కి.మీ పొడవైన (డబ్లింగ్) మార్గాన్ని, రూ.2,675.64 కోట్లతో రమ్నా - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని, రూ.2,084.90 కోట్లతో కట్ని - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని చేపట్టనున్నారు.

Railway projects worth Rs 10,700 crore get Cabinet green signal

అలాగే రూ.1,700.24 కోట్లతో బీహార్‌లోని రాంపూర్ దుమ్లా - తాల్ - రాజేంద్రపుల్ సెక్టారులో డబ్లింగ్, అదనపు బ్రిడ్జ్‌లను, రూ.1,443.32 కోట్లతో వార్దా - బల్షారా మధ్య 132 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని, రూ.1,595.76 కోట్లతో మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ - కాట్నీ మధ్య 165 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.

వచ్చే అయిదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిసిఈఎ నిర్ణయించింది. కాగా, గుంటూరు, గుంతకల్ మార్గంలో ద్రోణాచలం వరకూ డబ్లింగ్, ఒంగోలు - నాయుడుపేట మధ్య మూడవ లైన్, నడికుడి - బీబీనగర్ మధ్య డబ్లింగ్, రేణిగుంట - ద్రోణాచలం మధ్య డబ్లింగ్ తదితర ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు కోరినప్పటికీ, వాటికి ఆమోదం లభించలేదు.

English summary
The Cabinet cleared the construction of six railway lines and a bridge to meet passenger and freight needs in various areas of the country. The proposals will cost over Rs 10,700 crore and most part of the expenditure will be met through extra budgetary resources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X