మూడు రోజులు మిమ్మల్ని వదలబొమ్మాలీ అంటున్న భారీ వర్షాలు .. అలెర్ట్
ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతి పవనాలు దేశంలోని పలు ప్రాంతాలలో ఈరోజు విస్తరించాయి. నైరుతి రుతుపవనాల విస్తరణతో అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తో పాటు, దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాలు
పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రం తో పాటు కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, మణిపూర్, నాగాలాండ్, మిజోరాం లోని కొన్ని ప్రాంతాలకు, గోవా అంతట నైరుతీ రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నేడు వెల్లడించింది.

మూడు రోజుల పాటు వర్షాలు
ప్రస్తుతం మరఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక వద్ద ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపుకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు నేడు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
వర్షాల హెచ్చరిక చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఈ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఈ రోజు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.
20కి పైగా జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలెర్ట్ జారీ
రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 5 నుండి 7 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేసారు. వచ్చే 3 రోజులు రాష్ట్రంలోని 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు వాతావరణ శాఖాధికారులు.












Click it and Unblock the Notifications