Weathe Report: తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు..

ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ చత్తీస్ గడ్ నుంచి విదర్భ, తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి మీ ఎత్తున ద్రోణి వద్ద కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

వానల సమయంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందని వివరించింది . పలు చోట్ల పిడుగుల పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు 40°C కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లా వడగళ్ల వాన కురిసింది. సిద్దిపేట, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, హన్మకొండ, భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.

rains

వడగళ్లతో కోతకొచ్చిన వరి ధాన్యం రాలిపోయింంది. పలు చోట్ల ఐకేపీ సెంటర్లలోకి నీరు ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులతో మామిడి కాయాలు రాలిపోయాయి. మరోవైపు తడిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వెడుకుంటున్నారు. అకాల వర్షాలకు చేతికొచ్చి పంట వర్షర్పణం అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో పిడుగు పడి ముత్యం మల్లేశం అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం సాయంత్రం తాళ్లు ఎక్కడానికి వెళ్లిన మల్లేశం తాటిచెట్టు కింద కత్తి నురుతుండగా ఒకేసారి పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

జగిత్యాల జిల్లా బీమారం మండలం గోవిందారంలో పిడుగు పడి 20 గోర్లు మృతి చెందాయి. అటు ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. నిన్నటిదాకా ఆకుపచ్చగా కళకళలాడి ఎన్నో ఆశలను నింపి మంచి ఆదాయం వస్తుందని, కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆశించిన వారికి కన్నీరే మిగిలింది. నమ్ముకున్న పంట చేజారిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+