హైదరాబాద్‌లో వర్ష బీభత్సం: గంటలోనే కల్లోలం, కరెంట్ కట్, జీహెచ్ఎంసీ వార్నింగ్

హైదరాబాద్: నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలోని ఉన్నాయి.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. ఉప్పల్, తర్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకపూల్, మూసాపేట, ఎర్రగడ్డ, పటాన్ చెరు, ఆర్సీపురం, మణికొండ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మాదాపూర్‌లో 67.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలోనే ఉండిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నగరవాసులు అనవసరంగా బయటికి రాకూడదని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. అంతేగాక, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసరమైతే 040-21 111 111 ఈ నెంబర్ కు ఫోన్ చేయాలని కోరింది.

 Rainy night: heavy to very heavy rain in Hyderabad on monday night

సంగారెడ్డి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి వర్షం దంచికొట్టింది. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలోనూ భారీ వర్షం పడింది. తెలంగాణలో ఇతర జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.

తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు: పిడుగుపాటుకు ముగ్గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో సోమ, మంగళవారాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని తెలిపింది.

సోమవారం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీశ్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణలో రెండు మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, సోమవారం కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు వేర్వేరు చోట్లు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+