వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎస్ సమస్యను రాజ్‌నాథ్‌కు చెప్పిన కెసిఆర్, అసెంబ్లీ స్థానాల పెంపు పైనా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని, ఐపీఎస్‌లను తెలంగాణకు పెంచాలని, అలాగే అసెంబ్లీ సీట్లను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

జగదీశ్వర్ రెడ్డి, ఎంపీలు జితేందర్ రెడ్డి, కె కేశవ రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలా చారి తదితరులతో కలిసి సీఎం కెసిఆర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో శనివారం భేటీ అయ్యారు. పలు అంశాలు చర్చించడంతోపాటు లేఖలు అందజేశారు.

తెలంగాణలో నగర ప్రాంతం అధికంగా ఉందని, పోలీస్ సేవలు మరింత విస్తరించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఐపీఎస్‌ అధికారుల సంఖ్యని 141కి పెంచాలని కోరారు. గోదావరి, ప్రాణహిత నదుల వెంట ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలమీదుగా 330 కిమీ రోడ్డుని నిర్మించాలన్న ప్రభుత్వ యోచనను వివరించారు.

Raise IPS Cadre Strength in TS: KCR to Rajnath

దీనికి సంబంధించిన అనుమతులు వేగంగా వచ్చేలా చూడాలని కోరారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన రాజ్‌నాథ్‌.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకుర్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్‌ హైకోర్టు విభజనపై మాట్లాడారు.

కేంద్ర న్యాయమంత్రి సదానంద గౌడ తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. సీనియర్‌, జూనియర్‌ సివిల్ కోర్టుల న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని కెసిఆర్‌ కోరారు. అనంతరం వేణుగోపాలాచారి మీడియాతో మాట్లాడుతూ... అధికారుల కేటాయింపులు, ఐపీఎస్‌ల పెంపుపై సీఎం కేసీఆర్‌ ప్రధానంగా చర్చించారన్నారు.

Raise IPS Cadre Strength in TS: KCR to Rajnath

అసెంబ్లీ స్థానాల పెంపుపై ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కెసిఆర్‌లు అంగీకరించారని. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. అసెంబ్లీ స్థానాల పెంపుపై 'నాట్‌ విత్‌స్టాండింగ్‌' పదానికి మార్పులు చేసి సవరణతో వచ్చే సమావేశాల్లో బిల్లు పెట్టాలని కెసిఆర్ కోరగా.. రాజ్‌నాథ్‌ సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు.

ఐపీఎస్‌ల కొరత నేపథ్యంలో ఎవరైనా హైదరాబాద్‌కు వస్తానంటే వారికి అవకాశం ఇవ్వాలని సీఎం కోరారన్నారు. దీనికి కూడా రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కెసిఆర్ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర హోం మంత్రి హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా శాంతిభద్రతల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వామపక్ష తీవ్రవాద కార్యకలాపాలపై ఆరా తీశారు.

English summary
Chief minister K Chandrasekhar Rao has urged Union home minister Rajnath Singh to increase the cadre strength of IPS officers for Telangana state from the present 112 to 141.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X