సారిక మృతిపై కాంగ్రెస్ సీరియస్: రాజయ్య సస్పెన్షన్, బిగుస్తున్న ఉచ్చు
వరంగల్/న్యూఢిల్లీ: వరంగల్ మాజీ పార్లమెంటు సభ్యుడు, తమ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజయ్య నివాసంలో... ఆయన కోడలు సారిక, మనవళ్ల మృతిని పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.
రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు గత బుధవారం నాడు వేకువజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ పార్టీకు షాకిచ్చింది. వరంగల్ ఉప ఎన్నికల్లో రాజయ్య పోటీ చేయవలసి ఉంది.

కానీ ఈ పరిణామం నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మరో సీనియర్ నేత సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇంట్లో ప్రమాదంపై... సారిక, సారిక కుటుంబ సభ్యులు మహిళా సంఘాలు రాజయ్య కుటుంబం వైపు వేలెత్తి చూపాయి. ఆయన కుటుంబం ప్రస్తుతం జైలులో ఉంది.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజయ్యను పార్టీలోనే ఉంచుకుంటే ప్రభావం పడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించినట్లుగా తెలుస్తోంది. రాజయ్య పైన పడిన మచ్చ తమకు అంటకుండా ఉండేందుకు ఆయనను సస్పెండ్ చేయడమే మంచిదని అధిష్టానం భావించింది. తద్వారా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలో రాజయ్య పైన సస్పెన్షన్ వేటు పైన నాలుగు రోజులుగా పార్టీలో చర్చ సాగుతోంది. రాజయ్య నివాసంలో జరిగిన ప్రమాదంపై పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతల నుంచి పూర్తి వివరాలు ఆరా తీసింది. అనంతరం తర్జన భర్జన అనంతరం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
రాజయ్య కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మాజీ ఎంపీ రాజయ్య, ఆయన కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అనిల్ రెండో భార్య సనను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాజయ్యను పార్టీ సస్పెండ్ చేసింది. ఇంకోవైపు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications