బ్రేకింగ్ కోసమే మీడియా ప్రయత్నం, అందుకే సీఎంలు ప్రెస్‌మీట్లకు సిద్ధంగా లేరు: రాజ్‌దీప్ సర్దేశాయ్
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ క్లప్ 53వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్‌దీప్ సర్దేశాయ్ 'ఇండియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా' అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాదు ఎంతో మంది గొప్ప జర్నలిస్టులను అందించిందని చెప్పారు. మీడియాను అడ్వర్టయిజ్‌మెంట్ విభాగాలే శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదన్నారు.

జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరన్నారు. ఈ రోజుల్లో మీడియా సంచలనాల కోసమే ప్రయత్నాలు చేస్తోందన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్‌లు చాలా పెరిగాయన్నారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించడం లేదన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా ప్రారంభించారు. దీనికి కూడా ఆయన చీఫ్ గెస్టుగా ఉన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications