మౌనిక హత్య కేసు: పోలీసులకు లొంగిపోయిన ప్రియుడు రాజేష్
హైదరాబాద్:రెండు రోజుల క్రితం అడవి ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో మరణించిన మౌనిక మృతి కేసులో ఆమె ప్రియుడు రాజేష్ శుక్రవారం సాయంత్రం పోలీసులకు లొంగిపోయాడు.

మౌనిక రెండు రోజుల క్రితం అనుమానాస్పదస్థితిలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. అయితే మౌనికను ఆమె ప్రియుడు రాజేష్ హత్య చేసి ఉరేసి చంపాడని పోలీసులు తెలిపారు.
అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తే ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని ఈ హత్యకు సంబందించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications