• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి.!ఊరూరా సేవ కార్యక్రమాలు చేయాలని శ్రేణులకు టీపీసిసి పిలుపు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతిని వినూత్నంగా నిర్వహించుకునేందకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. కరోనా మహమ్మారి రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో బాదితులకు అంగడా ఉంటూనే రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు టీపిసిసి నాయకులు. ప్రతి గ్రామంలో రాజీవ్ వర్థంతి కార్యక్రమం నిర్వహిస్తూనే కోవిడ్ పేషెంట్లకు తగు సాయం అంధించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొరతగా ఉన్న ఆక్సీజన్, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు, వెంటిలేర్లు, బెడ్లతో పాటు సాధారణ ప్రజానికానికి మాస్కుల వంటి సదుపాయాలను కలిగించాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.

రాజీవ్ 30వ వర్ధంతి.. కార్యక్రమం జరుపుకుంటూనే కరోనా బాదితులకు అండగా ఉంటామన్న టీపిసిసి నేతలు..

రాజీవ్ 30వ వర్ధంతి.. కార్యక్రమం జరుపుకుంటూనే కరోనా బాదితులకు అండగా ఉంటామన్న టీపిసిసి నేతలు..

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధితో జనం అల్లడిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని భూ కబ్జాలు, ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియాలతో రాష్ట్రం అల్లకల్లోలం గా మారిందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు రాష్ట్రంలో కరోన వ్యాధితో వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరోనో టెస్ట్ లు లేవు, హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు, ఇంజెక్షన్లు లేవు, మందులు లేవు, ఆక్సిజన్ దొరకడం లేదు, వెంటిలేటర్లు లేవు చివరకు చనిపోయిన వారిని దహనం చేద్దామంటే దహన వాటికలు కూడా ఖాళీ లేవని, ఇంతటి దుర్మార్గమైన పాలన ఎన్నడూ, ఎక్కడ చూడలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది..ప్రతిపక్షాలే ప్రధాన పాత్ర పోషించాలన్న కాంగ్రెస్..

రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది..ప్రతిపక్షాలే ప్రధాన పాత్ర పోషించాలన్న కాంగ్రెస్..

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి తోచిన సహాయ, సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. మే 21వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందకూ ప్రజల సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు. ప్రతి బూత్ లో ఏదో ఒక సేవ కార్యక్రమాలు చేయాలని, కనీసం 50 మందికి మాస్కలు పంపిణీ చేయాలని, మందుల కిట్లు, ఆహార పదార్థాల పంపిణీ, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం, రక్తదానాలు తదితర కార్యక్రమాలు చేపట్టాలని పీసిసి ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

గ్రామాల్లో సైతం వేడుకలు.. కరోనా బాదితులకు సేవచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఏఐసీసీ..

గ్రామాల్లో సైతం వేడుకలు.. కరోనా బాదితులకు సేవచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఏఐసీసీ..

ఈ నెల 21 నా రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా దేశంలో కరోనా బాధితుల కోసం సహాయం అందించాలని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరియు దేశంలోని నలు మూలల్లో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర, జిల్లా, మండల కార్యాలయాలను కరోనా వైరస్ బాధితుల కోసం అక్కడి ప్రభుత్వానికి కొన్ని నెలల కోసం ఇవ్వాలనే ప్రతిపాదన చేయాలని నాయకులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రెండవ దశ తీవ్ర పరిణామాలు చూపిస్తున్న తరుణంలో బాదితులకు అండగా ఉంగాలనే ప్రతిపాదన ప్రధానంగా వినిపించినట్టు తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకంగా రాహుల్ కేర్.. కరోనా పేషెంట్లకు వైద్య సదుపాయం కల్పించడంలో ముందుండాలన్న రాహుల్

ప్రతిష్టాత్మకంగా రాహుల్ కేర్.. కరోనా పేషెంట్లకు వైద్య సదుపాయం కల్పించడంలో ముందుండాలన్న రాహుల్

నగరంలోని కాంగ్రెస్ కార్యాలయాలు గాంధీ భవన్, ఇందిరా భవన్ మరియు అందుబాటులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయాలను కరోనా వైద్యం కోసం ప్రభుత్వనికి కొద్ది కాలం ఇవ్వాలనే అభిప్రాయాలను కొంతమంది నేతలు వ్యక్తం చేసారు. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా రాహుల్ కేర్ అనే పేరుతో అంబులెన్స్ లు, ఆక్సిజన్ సిలిండర్లు లు, మాస్క్ లు, కరోనా టికా సంబందించి నమోదు, ఇతర సహాయ కరిక్రమం చేపట్టడం వల్ల లక్షలాది మంది కరోనా బాధితులకు ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఏదేమైనా కరోనా క్లష్ట సమయంలో బాదితులకు అండగా ఉండాలనే కార్యాచరణ ఉన్నతమైందనే చర్చ జరగుతోంది.

English summary
The Congress party is preparing to celebrate the 30th death anniversary of the late former Prime Minister Rajiv Gandhi in an innovative way. TPCC leaders are planning to hold a Rajiv Gandhi Varghanthi on the eve of the second phase of the Corona epidemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X