కొండా సురేఖ సమంతను పొగిడారట!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతల విడాకుల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలోనూ అలాగే దేశవ్యాప్తంగా ను చర్చనీయాంశమయ్యాయి. ప్రతి ఒక్కరు కొండా సురేఖ సమంతను అవమానించిందని క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున సురేఖను డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన మహిళా మంత్రి అయ్యుండి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని సురేఖపైన మండిపడ్డారు.

కొండా సురేఖ సమంతను అవమానించలేదు
అయితే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం కొండా సురేఖ సమంతను పొగిడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడం ఏమిటి? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది సమంతను కాదని ఆయన పేర్కొన్నారు.

Ram gopal varma sensational comments on konda surekha praised samantha

కొండా సురేఖ అవమానించింది వాళ్ళను
కొండా సురేఖ అవమానించింది నాగార్జునని, నాగచైతన్యనీ అంటూ రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని, ఒక భార్యను వాళ్లకు సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్ తో పంపించడానికి ట్రై చేస్తే తను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన ఇన్సల్ట్ నేను నా జీవితంలో వినలేదు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

సీరియస్ గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం చెప్పాలి
ఇక్కడ ఘోర అవమానం జరిగింది నాగచైతన్యకు, నాగార్జునకు మాత్రమేనని సమంతకు కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది సమంతను అవమానించడం ఎలా అయిందో చెప్పాలని ప్రశ్నించారు. వాళ్ళిద్దరి కోసమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఉండే అందరికోసం ఈ విషయాన్ని నాగార్జున, నాగచైతన్య చాలా సీరియస్ గా తీసుకొని మరిచిపోలేని గుణపాఠం నేర్పాలని రాంగోపాల్ వర్మ మరోమారు సంచలన పోస్ట్ పెట్టారు.

కళ్ళతో చూసి, చెవులతో విన్నట్టు నిందలు
ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్టు కన్ఫర్మేషన్ తో మీడియా ముందు అరిచి చెప్పడం దారుణమని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున నాగచైతన్య వంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగిన మహానటి మీద అంత నీచమైన మాటలను తీవ్రంగా ఖండించాలని అంతకుముందు పేర్కొన్నారు.

Ram gopal varma sensational comments on konda surekha praised samantha

అసలు ఆమె ఇష్యూతో సంబంధం లేని వారిని అవమానిస్తారా?
ఇక కేటీఆర్ ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించడంలో అర్థం ఏమిటో కనీసం ఆవిడకైనా అర్థమై ఉంటుందో లేదో నాకు అర్థం కావడం లేదని రాంగోపాల్ వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరో అవమానించారని అసలు ఆ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని నాగార్జున నాగచైతన్య లను అంతకన్నా దారుణంగా అవమానించడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.

ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమిటి
తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఇప్పుడు కూడా కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+