రామోజీ ఫిల్మ్ సిటీపై నిలదీత, బీజేపీకి తెరాస ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం రాక ముందు రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని తెరాస అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాడు చెప్పారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం అన్నారు.
అయితే, మధ్యలో కల్పించుకున్న మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యుడు బడ్జెట్‌తో సంబంధం లేని అంశాలను మాట్లాడుతున్నారన్నారు. సీఎం అన్నట్లుగా ఆధారాలు ఉంటే సభకు సమర్పించాలని అని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాడు అనని మాటలను ఆపాదించవదన్నారు. దీనికి ప్రతిగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గతంలో సీఎం అన్నారని ముక్త సరిగా చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చడం సరికాదన్నారు. ఇప్పుడున్న సచివాలయం స్థలంలోనే అధునాతన భవనాలను నిర్మించాలని, ఎర్రగడ్డలోనూ ఆసుపత్రి భవనాన్ని కొత్తది నిర్మించాలని సూచించారు. శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను నిర్మించాలన్నారు.
బీజేపీకి తెరాస ఆఫర్
బడ్జెట్ పద్దుల పైన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు చింతల రామచంద్రా రెడ్డికి అధికార తెరాస మంత్రులకు సోమవారం ఆసక్తికర సంభాషణ సాగింది. ఈ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని విమర్శించారు. దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. మీరు కూడా మాలో చేరితే.. అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications