స్కూల్లోనే టీచర్‌ను పొడిచి ఆత్మాహత్యాయత్నం చేసిన భర్త, ఎందుకంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లిలో దారుణం చోటు చేసుకొంది. ముసలాయిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలును స్కూలోనే విద్యార్ధులు చూస్తుండగానే ఆమె భర్త కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం చోటు చేసుకొంది.

మహబూబ్‌నగర్ జిల్లా దాదాన్‌పల్లికి చెందిన కన్యాకుమారికి కర్నూల్ జిల్లాకు చెందిన రమణారెడ్డితో ఏడేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇధ్దరు పిల్లలు. కన్యాకుమారి ముస్లాయిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఫ్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త రమణారెడ్డి ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

Ramana Reddy suicide attempt after stabbing his wife in Mahaboobnagar district

అయితే మద్యానికి బానిసగా మారిన రమణారెడ్డి భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే బుధవారం నాడు స్కూల్ కు వెళ్ళిన రమణారెడ్డి కత్తితో పొడిచాడు. స్కూల్ ఆవరణలోనే అందరూ చూస్తుండగానే కన్యాకుమారిపై దాడికి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తన గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

కన్యాకుమారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. రమణారెడ్డికి ప్రాథమిక చికిత్స చేశారు. కన్యాకుమారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ramana Reddy suicide attempt after attacked with knife his wife in school premises on Wednesday in Mahabubnagar district.police registered a case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X