ఎంసెట్ లీకేజీపై దద్దరిల్లిన ఆందోళనలు.. (ఫోటోలు)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : ఎంసెట్ 2 లీకేజీపై అటు విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో శుక్రవారం నాడు ఇందిరా పార్క్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తలకు దారి తీసింది.

లీకేజీని వ్యతిరేకిస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి తప్పితే పరీక్ష మళ్లీ నిర్వహిస్తే లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు సందిగ్దంలో పడుతుందనేది తల్లిదండ్రుల వాదన. ఇదే వాదనను బలంగా వినిపిస్తూ.. ప్రభుత్వానికి తమ నిరసన సెగ తగిలించే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయితే రంగ ప్రవేశం చేసిన పోలీసులు అందరిని స్టేషన్ కు తరలించగా.. అక్కడ కూడా తమ నిరసన గళం వినిపించారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.

తిరగబడ్డ తల్లిదండ్రులు :

తిరగబడ్డ తల్లిదండ్రులు :


ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని బలంగా వాదిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తొలుత సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు, పోలీసులు అడ్డుకోవడంతో ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టారు.

ధర్నాకు తరలివచ్చి :

ధర్నాకు తరలివచ్చి :


ర్యాంకర్లు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. ధర్నా ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందిరా పార్క్ వద్ద విద్యార్థులను తల్లిదండ్రులను వారించిన పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కష్టపడి చదివిందంతా వృథా?

కష్టపడి చదివిందంతా వృథా?


పోలీస్ స్టేషన్ కు తరలించినా.. తల్లిదండ్రులు తమ ఆందోళనను విరమించలేదు. పరీక్ష మళ్లీ నిర్వహిస్తే.. ఇవే ర్యాంకులు ఫలితాలు వస్తాయా.. కష్టపడి చదివిందంతా వృథానేనా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన

టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన


లీకేజీపై ప్రభుత్వ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను తగలబెట్టారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు. బషీర్ బాగ్ చౌరస్తాలో టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు రఘు కిరణ్ ఆద్వర్యంలో ఆందోళనకు దిగారు టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలు.

అసమర్థ ప్రభుత్వం

అసమర్థ ప్రభుత్వం


టీఎన్ఎస్ఎఫ్ ఆందోళనకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు చిలుకా మధుసూధన్ అసమర్థ ప్రభుత్వం వల్లే ఎంసెట్ లో లీకేజీ చోటు చేసుకుందని మండిపడ్డారు.

సీబీఐ విచారణకు డిమాండ్

సీబీఐ విచారణకు డిమాండ్


లీకేజీపై సీబీఐతో విచారణ చేయిస్తే ప్రభుత్వ పెద్దల వ్యవహారం బయటపడుతుందని ఆరోపించారు టీఎన్ఎస్ఎఫ్ నేతలు.

తూతూ మంత్రం

తూతూ మంత్రం


సీఐడీతో తూతూ మంత్రంగా విచారణ జరిపించి చేతులు దులుపుకున్నారని, విద్యార్థుల జీవితాలను దుర్భరంగా మార్చారని విమర్శించారు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు.

సొమ్ము చేసుకుంటోందా..?

సొమ్ము చేసుకుంటోందా..?


ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందంటే ఏదో అనుకున్నామని, లీకేజీలకు పాల్పడి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తారని భావించలేదని విద్యార్ధి నాయకులు ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి కడియం శ్రీహరి, వైద్యశాఖ మంత్రి డాక్టర్.లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్ టియు రమణారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rankers Parents And TNSF student leaders Dharna against Eamcet leakage. They held dharna at indira park before that they went to secratariat to oppose the officials

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X