Rapido: రాపిడో బంపర్ ఆఫర్.. ఆ రోజు ఉచిత రైడ్..!
బైక్ ట్యాక్సీ సేవల సంస్థ రాపిడో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ రోజు ఓటు వేయడానికి వేళ్లే వారికి ఉచితంగా సేవలు అందించనుంది. మే 13న పోలింగ్ రోజు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఓటర్లకు ఉచిత వాహన సేవలను అందించనుంది. తన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా, పోలింగ్ రోజున ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి రాపిడో (Rapido) తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO)తో కలిసి పని చేస్తుంది.
పోలింగ్ రోజున 100 నగరాల్లో 10 లక్షల మంది ఓటర్లకు సర్వీస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలు మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల వంటి వివిధ లోక్‌సభ స్థానాల పరిధిలోకి ఓటర్లు ఈ ఉచిత సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సిఇఒ వికాస్ రాజ్, రాపిడో చొరవను ప్రశంసించారు.

రాపిడో ఉపయోగించుకుని ఓటింగ్ శాతం పెంచాలన్నారు. "సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్లకు ఉచిత రైడ్‌లను అందించడానికి రాపిడో చొరవ అభినందనీయమైన చర్య. ఇది ఓటరు భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామికంగా యాక్సెసిబిలిటీని ప్రోత్సహిస్తుంది" అని వికాస్ రాజ్ అన్నారు. సాధారణంగా అర్బన్ ఏరియాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. నగరాల్లో ఓటింగ్ ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.












Click it and Unblock the Notifications