వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆసుపత్రిలో ఎలుకలు బాబోయ్ ఎలుకలు.. ఎంజీఎం ఘటనతోనూ పాఠాలు నేర్వని ఆరోగ్యశాఖ

|
Google Oneindia TeluguNews

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగి కాలివేళ్ళు, చేతులవేళ్ళు ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు మృతి చెందిన విషయం తెలిసిందే.పైప్లైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషంట్లను కొరుకుతున్న పరిస్థితులపై ప్రజల ఆందోళనల నేపధ్యంలో చర్యలు చేపడతామని చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ. ఒక్క ఎంజీఎం ఆస్పత్రిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆస్పత్రుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. వసతుల లేమి, ఎలుకల బెడదతో ఆస్పత్రులకు వచ్చిన రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

హుస్సేన్ సాగర్ లా జంట జలాశయాలు మారతాయి; న్యాయపోరాటం చేస్తామన్న పర్యావరణవేత్తలుహుస్సేన్ సాగర్ లా జంట జలాశయాలు మారతాయి; న్యాయపోరాటం చేస్తామన్న పర్యావరణవేత్తలు

కామారెడ్డి ప్రభుత్వం ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు స్వైర విహారం

కామారెడ్డి ప్రభుత్వం ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు స్వైర విహారం


కామారెడ్డిలోని సర్కారు ఆసుపత్రి సమస్యల వలయంగా మారింది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి. నిత్యం ఓపీ పేషెంట్లు 200 మందికి పైగా వస్తుండగా.. ఇన్ పేషెంట్లు అదే స్దాయిలో ఉంటారు. ఈ ఆస్పత్రిలోనూ ఎలకలు తిష్ట వేశాయి.. కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎలుకలను పట్టుకునేందుకు ఏకంగా.. ఐసీయూలో బోన్లు, ర్యాట్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. సర్కారు ఆసుపత్రులకు ఆదరణ పెరుగుతున్నా.. ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, రోగులకు వసతులు కల్పించడంలో వైద్య విధాన పరిషత్ అధికారులు విఫలం అవుతున్నారు.

ఎంజీఎం ఆస్పత్రి ఘటనతోనైనా మారని సర్కార్ తీరు

ఎంజీఎం ఆస్పత్రి ఘటనతోనైనా మారని సర్కార్ తీరు


ఐసీయూలో ఎలుకలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులకు కంటి మీద కునుకు లేని పరిస్థితి నెలకొంది. వరంగల్ ఎంజీఎం ఘటన నుంచి వైద్యశాఖ అధికారులు పాఠాలు నేర్చుకోకపోవడం పట్ల రోగులు మండిపడుతున్నారు.వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో.. చికిత్స పొందుతున్న రోగిని ఎలకలు దారుణంగా కొరికి చంపేశాయి. ఈ ఘటన మరువక ముందే.. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూ, ట్రామాకేర్ విభాగంలో ఎలుకల గుంపుగా సంచరిస్తూ.. రోగులకు ముప్పు తిప్పులు పెడుతున్నాయి.

ఆత్యవసర విభాగాల్లోనూ ఎలుకలు.. రోగుల ఆందోళన

ఆత్యవసర విభాగాల్లోనూ ఎలుకలు.. రోగుల ఆందోళన


ఆసుపత్రిలో ఏ వార్డులో చూసినా ఎలుకల సంచారం కనిపిస్తుండటం ఆసుపత్రిలో పారిశుద్ద్య నిర్వహణకు అద్దం పడుతుంది. అత్యవసర విభాగాల్లో ఎలుకలు చొరపడి రోగులపై దూకుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఎలుకలు కొరికి ఓ రోగి ప్రాణం పోయినా.. అధికారులు మేల్కొనకపోవడం దవాఖానాల్లో భద్రత డొల్లతనానికి దర్పణంలా నిలుస్తోంది. ఎలుకలు రోగుల పైకి వస్తున్నాయని రోగుల బంధువులు ఆందోళన చెందుతున్నాయి. గుంపులుగా తిరుగున్నా.. పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. మొదట్లో ఎలుకలు బోన్లు, ర్యాట్ ప్యాడ్లు పెట్టినా ఇప్పుడు మళ్ళీ పరిస్థితి ఏం మారలేదని అంటున్నారు.

ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణా లోపం, తాగునీటికి తిప్పలే

ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణా లోపం, తాగునీటికి తిప్పలే


కామారెడ్డి ఆసుపత్రిలో ప్రసూతి సేవలు బాగున్నా.. ఆసుపత్రిలో మౌలిక వసతులు, పారిశుద్ద్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రోగులకు కనీసం తాగు నీళ్లు సైతం ఆసుపత్రిలో అందుబాటులో లేక.. పేషంట్ల బంధువులు బాటిళ్లు పట్టుకుని.. దూర ప్రాంతాల నుంచ నీళ్లు కొనుక్కుని వస్తున్నారు. కొద్ది రోజులుగా నీటి సమస్యతో రోగులు దాహాంతో అలమటిస్తున్నారు. ఇటు ఆసుపత్రిలో ఎలుకలు రోగులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఐసీయూ వార్డులు ఎలుకలకు నిలయాలుగా ఉన్నాయంటే.. సాధారణ వార్డుల్లో ఎలాంటి పరిస్దితి ఉందో అర్దం చేసుకోవచ్చు.

 సర్కార్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై మంత్రి దృష్టి పెట్టాలి

సర్కార్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై మంత్రి దృష్టి పెట్టాలి


సర్కారు ఆసుపత్రులపై ఆదరణ పెరగాలని భావిస్తున్న ప్రభుత్వం ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన చేస్తే బాగుంటుంది. అంతే కాదు ఆస్పత్రుల్లో ఎలుకలు, కుక్కల బెడద నుండి కాపాడటం కోసం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు ఇప్పటికైనా సర్కార్ ఆస్పతుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

English summary
The Kamareddy Hospital is plagued by rats, dogs, and a lack of facilities. Critics say that the health department is not learned lessons from the MGM incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X