పెద్ద నోట్ల రద్దు తర్వాత..: రూ.20, రూ.50 కొత్త నోట్లను తీసుకు రానున్న ఆర్బీఐ
కొత్త రూ.20, రూ.50 నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది.
ముంబై: పెద్ద నోట్లను రద్దు చేసి కొత్తగా రూ.2000 నోటును, అలాగే మోడిఫై చేసిన రూ.500 నోటును ఆర్బీఐ తాజాగా తీసుకు వచ్చింది. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. కొత్త రూ.20, రూ.50 నోట్లను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది.

కొత్త రూ.20, రూ.50 నోట్లు తీసుకు వచ్చినా పాతవి కూడా చలామణిలో ఉంటాయి. పాతవాటిని రద్దు చేయరు. ఈ కొత్త నోట్లను త్వరలో తీసుకు రానున్నారు. కొత్తగా వచ్చే రూ.20, రూ.50 నోట్ల పైన ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ సంతకం ఉండనుంది.
మహాత్మా గాంధీ సిరీస్-2005లో భాగంగా ఎల్ సిరీస్ ఫార్మాట్‌లో కొత్త నోట్లు వస్తాయి. వీటిపై ఉర్జిత్ సంతకంతో పాటు 2016 సంవత్సరం ముద్రించి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించి కొత్త నోట్లను తీసుకు వస్తున్నారు.












Click it and Unblock the Notifications