ఆస్ట్రేలియా మహిళ మృతి: ప్రియుడి కోసం హైదరాబాద్‌కు, అతిగా డ్రగ్స్ తీసుకుని...
హైదరాబాద్: మాదకద్రవ్యాలను అతిగా వినియోగించడం వల్లనే ఆస్ట్రేలియా మహిళ మరణించినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ విదేశీ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మాదకద్రవ్యాలు అతిగా వినియోగించటం వల్లనే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
నైజీరియన్ యువకుడితో సహజీవనం సాగిస్తున్న ఆమె తరచూ ప్రియుడి కోసం ఇక్కడికి హైదరాబాదుకు సాగిస్తుండేది. మరణించిన ఆమె వయసు 55 సంవత్సరాలు. సహజీవనం చేస్తున్నట్టు చెబుతున్న కుర్రాడి వయసు 25 ఏళ్లు. మార్గరెట్ లిండా(55) స్వస్థలం ఆస్ట్రేలియా. యువకుడి పేరు ఆల్‌బర్ట్ కుకర్ నైజీరియా దేశస్థుడు.

స్టూడెంట్ వీసాతో నగరంలోని ఓ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరికీ నగరంలో పరిచయం ఏర్పడింది. అది క్రమేణా సహజీవనం వరకూ వెళ్లింది. ఆమె మూడు నెలలకోసారి టూరిస్ట్ వీసాపై నగరానికి వచ్చి వెళుతుండేది. ఈ నేపథ్యంలో నగరానికి ఇటీవల వచ్చింది. ప్రియుడు వద్దే అక్బర్‌బాగ్‌లో ఉంటోంది.
ఆస్తమాతో బాధపడుతున్న ఆమె ఉపశమనం పొందేందుకు మాదక ద్రవ్యాలు తీసుకునేది. దీర్ఘకాలంగా వాటిని వాడటంతో డ్రగ్స్‌కు బానిసైంది. నగరానికి వచ్చినప్పటి నుంచి అధిక మోతాదులో వాటిని తీసుకోవటం ప్రారంభించింది. బుధవారం అర్ధరాత్రి బాత్రూమ్‌లో అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని గమనించిన యువకుడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సహజీవనం సాగిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె అనారోగ్య కారణాలతోనే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చెన్నైలోని ఇండియా-ఆసే్ట్రలియా అంబాసిడర్ రియా గోల్కొండ పోలీసులకు ఫోన్ చేశారు. ఆసే్ట్రలియా మహిళ మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications