మద్యం చిల్: దసరా 'దావత్'తో ఎక్సైజ్ ఖజానా ఫుల్, ఒక్క సెప్టెంబర్ లోనే..

Subscribe to Oneindia Telugu

ఆదిలాబాద్: పండుగ పూట 'దావత్' లేకపోతే అదసలు పండుగేనా? అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. కాబట్టే పండుగలు సమీపిస్తున్నాయంటే చాలు.. ఎక్సైజ్ శాఖ గల్లా పెట్టె కళకళలాడుతుంటుంది.

కేసుల కొద్ది బీర్లు, మద్యం విక్రయాలతో ఎక్సైజ్ ఖజానా ఏటికేడు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ముఖ్యంగా దసరా లాంటి పండుగలకైతే మద్యం విక్రయాల జోరు మామూలుగా ఉండటం లేదు. ఎప్పటి లాగే ఇటవలి దసరా పండుగ కూడా ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది.

 ఉమ్మడి ఆదిలాబాద్‌లో అధికంగా:

ఉమ్మడి ఆదిలాబాద్‌లో అధికంగా:

పాత ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు అధికంగా సాగాయి. తెలంగాణ ప్రభుత్వం గుడుంబాను రూపుమాపడంతో.. పల్లెల్లోను మద్యం ప్రియులు బీరు, విస్కీలను భారీ మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా ఒక్క సెప్టెంబర్ లోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 158 మద్యం దుకాణాల్లో రూ.68.57కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి.

పెరిగిన ఆదాయం:

పెరిగిన ఆదాయం:

గత సంవత్సరంతో పోల్చితే ఉమ్మడి జిల్లాలో 55శాతం మద్యం అమ్మకాలు పెరిగాయి.

గతేడాది సెప్టెంబర్‌లో మద్యం అమ్మకాల ద్వారా రూ.41.25కోట్లు రాగా, బీరు అమ్మకాల ద్వారా 12.34కోట్ల ఆదాయం వచ్చింది.

ఇక ఈ ఏడాది బీరు కేసుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.17.42కోట్లు కాగా, ఐఎంఎల్‌ మద్యం కేసుల ద్వారా రూ.51.15కోట్ల ఆదాయం సమకూరింది. చివరి వారం రోజుల్లో రూ.25కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం.

 సెప్టెంబర్‌లో పీక్స్:

సెప్టెంబర్‌లో పీక్స్:

ప్రతీ ఏడాది సెప్టెంబర్ లోనే మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఉమ్మడి జిల్లాలో లక్షా 27వేల 304 మద్యం కేసులు, 93వేల 521 బీరు కేసులు అమ్ముడుపోయాయి. ఫలితంగా రూ.53.59కోట్ల ఆదాయం వచ్చింది.

ఇక ఈ ఏడాది సెప్టెంబర్ లోను మద్యం అమ్మకాల జోరు మరింత పెరిగింది. నెల ప్రారంభం నుంచి చివరి వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షా 45వేల 388మద్యం కేసులు లక్షా 32వేల 26 బీరు కేసులు విక్రయాలు జరిగాయి. వీటి ద్వారా రూ.68.57కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే రూ.15కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.

గుడుంబాకు చెక్ పెట్టడంతో:

గుడుంబాకు చెక్ పెట్టడంతో:

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలకు తోడు గుడుంబాను నిర్మూలించడం వల్ల జిల్లాలో మద్యం విక్రయాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి గతేడాది గుడుంబా స్థావరాలను నిర్మూలించారు.

ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడంతో గుడుంబా తగ్గుముఖం పట్టింది. దీంతో గుడుంబా అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయి మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి.
కాగా, గతంలో ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు వచ్చే ఎక్సైజ్‌ ఆదాయం 2015 నుంచి ప్రతీ ఏడాది రూ.700 కోట్ల పైచిలుకు వస్తుండటం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Record flow of cash from sale of liquor into the state treasury, Alcohol sales are hiked in Adilabad during Dasara

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి