హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుష్ప సినిమాను మించి... ఫామ్ హౌస్ లలో సెప్టిక్ ట్యాంకులలో ఎర్రచందనం; నలుగురు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఎర్రచందనం స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుంది అనుకుంటే పొరబాటే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతుందని ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ కేసు స్పష్టం చేసింది. పుష్ప సినిమాను మించి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠా సాగిస్తున్న దందాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.

ఏపీ నుండి తెలంగాణాకు గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర చందనం దందా

ఏపీ నుండి తెలంగాణాకు గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర చందనం దందా


దాదాపు 75 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి అతి సమీపంలో ఫ్యూచర్ సిటీ వెంచర్ వద్ద ఉన్న రెండు ఫాం హౌస్ లలో సెప్టిక్ ట్యాంక్ లతోపాటు, భూమిలో ఎర్ర చందనం దుంగలను పాతిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కి ఎర్ర చందనం దుంగలను చేర్చి, అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

75 లక్షల రూపాయల విలువైన 500 కిలోల ఎర్రచందనం ను సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్

75 లక్షల రూపాయల విలువైన 500 కిలోల ఎర్రచందనం ను సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్


నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన ఇనాయత్ ఖాన్, అబ్దుల్ ఖాదర్ ఖురేషిలతో పాటు కడప జిల్లాకు చెందిన రవి చంద్ర, షేక్ అబ్దుల్లా, ముజాహిదీన్ లు ఈ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిని రిమాండ్ కు తరలించారు. వీరి వద్దనుండి 75 లక్షల రూపాయల విలువైన 500 కిలోల ఎర్రచందనం ను సీజ్ చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా దందా సాగిస్తుందిలా

ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా దందా సాగిస్తుందిలా

కడప జిల్లా ప్రొద్దుటూరు కి చెందిన షేక్ అబ్దుల్లా అనే ప్రధాన నిందితుడు రవిచంద్ర అనే వ్యక్తి ద్వారా ఎర్ర బంగారాన్ని తీసుకొని ముజాహిదీన్ ద్వారా హైదరాబాద్ కు చేర్చి అక్కడ నుండి వాటిని విక్రయిస్తున్నారు.ముందు శ్యాంపిల్స్ చూపించి డీల్ కుదుర్చుకుని ఆపై అక్రమ రవాణా ప్లాన్ అమలు చేస్తున్నారు.

పక్కా సమాచారంతో దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాలో నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతంఈ ముఠా సభ్యుడు రవి చంద్ర మాత్రం పరారీలో ఉన్నాడు. రవిచంద్ర గతంలో కూడా ఇటువంటి స్మగ్లింగ్ వ్యాపారం చేసేవాడు అని పోలీసుల విచారణలో తేలింది. పరారీలో ఉన్న రవిచంద్ర కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

English summary
Task force officials have seized 75 lakh worth of red sandalwood logs illegally hidden in septic tanks in farm houses near kalvakurthi. Four people who were involved in the smuggling were arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X