అక్కడ ఫ్రిజ్ లు, కొత్త టీవీలు, వాషింగ్ మెషీన్లు.. నక్కతోక తొక్కిన ఓటర్లు!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది.దీంతో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. ఇందులోనే ప్రలోభాల పర్వం కూడా మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రయత్నిస్తున్నారు.
ఓట్ల కోసం మొదలైన ప్రలోభాలు
ప్రచార గడువు ముగియనుండటంతో, అభ్యర్థులు ఇప్పుడు తాయిలాల పంపిణీకి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో రాత్రి వేళల్లో జరగాల్సింది అంతా జరిగిపోతుంది. రాత్రివేళల్లో సన్నిహితులతో రహస్యంగా ఇంటింటికీ వెళ్లే అభ్యర్థులు, ఓటర్ల కాళ్లు పట్టుకుని, నజరానాలందించి తమకే ఓటు వేయాలని ప్రమాణాలు చేయించుకుంటున్నారు.ఆయా మున్సిపాలిటీలలో వార్డులలో ఓట్లను ఇవ్వగలిగిన కీలక నేతల ఇళ్ళకు వెళ్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ప్రలోభాలు పీక్స్ లో.. ఎందుకంటె
ముఖ్యంగా ప్రలోభాలు రంగారెడ్డి జిల్లాలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంకరపల్లి, షాద్‌నగర్ సహా మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఖర్చుకు వెనకాడటం లేదు. అక్కడ చాలామంది రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేస్తున్న వారే ఉండటంతో వారు డబ్బు బాగా ఖర్చు పెట్టటానికి రెడీ అయ్యారు.
ఒకరు టీవీ, మరొక అభ్యర్థి ఫ్రిజ్.. వామ్మో తాయిలాలు బాగానే
తాజాగా ఒక వార్త మొయినాబాద్ మున్సిపాలిటీలో హల్చల్ చేస్తుంది.ఒక వార్డు అభ్యర్థి నలుగురు ఓటర్లున్న ఇంట్లో పాతటీవీ చూసి కొత్తటీవీ పంపించారు. విషయం తెలిసిన ప్రత్యర్థి, కొత్త ఫ్రిజ్‌తో అదే ఇంటికి వెళ్లి మిగతా ఓట్లు తనకు వేయాలని ప్రమాణం చేయించుకున్నారు అని స్థానికంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు మొయినాబాద్ లోనే కాదు రంగారెడ్డిజిల్లా పరిధిలోని అనేక మున్సిపాలిటీల పరిధిలో కొత్త టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్‌లు దర్శనమిస్తున్నాయి.
టోకెన్ అమౌంట్ ఫర్ వోట్
ఇదిలా ఉంటే శంకరపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు 'టోకెన్ అమౌంట్'గా రూ. 5,000 పంపిణీ చేశారని సమాచారం. ఎన్నికలయ్యాక ఇంకా నగదు ఇస్తామని హామీ ఇచ్చి ఓటర్లచే ప్రమాణం చేయించుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. జనరల్‌కు రిజర్వ్ అయినందున, గెలిస్తే ఛైర్మన్‌ను అవుతాననుకుంటున్న ఒక అభ్యర్థి మహిళలకు చీరెలు, మిక్సీలతో పాటు నగదును పంచుతున్నారని కూడా సమాచారం.
అభ్యర్థుల నుండి హామీలు తీసుకుంటున్న ఓటర్లు
అభ్యర్థుల ప్రలోభాలకు లోనవుతున్న ఓటర్లు కూడా తెలివిగానే ఉన్నారు. వస్తువులు ఇచ్చిన అభ్యర్థులు ఓడిపోతే వస్తువులు తిరిగి ఎక్కడ ఇచ్చెయ్యమంటారో అని ముందే ఊహించి, అభ్యర్థులతో ఇచ్చిన బహుమతులు తిరిగి అడగకూడదని ముందే హామీలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రలోభాలను కట్టడి చెయ్యాల్సిన అవసరం ఉంది, ఓటు అనేది ప్రలోభాలకు లొంగి వేస్తే రేపు వాళ్ళు మీకు ఇచ్చిన దానికి డబుల్ వసూలు చేస్తారని, అలాంటి వాళ్ళను ఎన్నుకోవద్దని అధికారులు చెప్తున్నారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications