కోమటిరెడ్డి, సంపత్‌లకు ఊరట: హైకోర్టులో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్‌లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.
Recommended Video

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వ రద్దుపై గతంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. అయితే వారి విజ్ఞాపనను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సమర్థించింది. కోమటిరెడ్డి, సంపత్‌లపై రాజకీయ దురుద్దేశ్యంతో అనర్హత వేటు వేశారని వాళ్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేసారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిన కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి సభ్యత్వాల రద్దు చెల్లదని సింగిల్ బెంచ్ తీరప్పు ఇచ్చింది. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వెల్లడించింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌కు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications