లోక్ సభ వార్ ....పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని సిఈవో కు ఫిర్యాదు చేసిన రేణుకా చౌదరి
Recommended Video
ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ్ రోజు అధికార పార్టీ ఆగడాలు హద్దుమీరాయి అని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థి రేణుకా చౌదరి ఆరోపించారు. ఖమ్మం లోక్ సభ పరిధిలో పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని ఆమె అధికార పార్టీ నేతలపై మండిపడ్డారు. సీఈవో రజత్ కుమార్ కు ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసిన రేణుకా చౌదరి ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్లో స్థానిక ఎమ్మెల్యే వారి చుట్టాలను, స్టూడెంట్స్ ను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది అన్న రేణుకా చౌదరి మహిళలపై దాడుల కేసులు ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎలా పోటీ చేయనిచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇక ఎన్నికలు జరుగుతున్న రోజు జరుగుతున్న అవకతవకలపై ఖమ్మం రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని, ఏ విధమైన చర్యలు తీసుకోలేదని రేణుక చౌదరి ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని తగిన చర్య తీసుకోవాలని ఆమె సీఈవో రజత్ కుమార్ ను కోరారు.












Click it and Unblock the Notifications