Medigadda: సవాల్‍గా మారిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్..
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సర్కార్ తలనొప్పిగా మారింది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల ఖర్చు అవ్వడమే కాకుండా.. భారీగా మెయింటనెన్స్ అవుతోంది. దీని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంతో నీటి నిల్వ కింది వదిలేశారు. ప్రస్తుతం ఈ బ్యారేజీ నిరుపయోగంగా మారింది. ఈ ప్రాజెక్టును రీపేర్ చేయడం కష్టంగా మారింది. కుంగిన పిల్లర్లను కూల్చడం ఆఫీసర్లకు టాస్క్ లా మారింది.
నిర్మించడం కంటే కూల్చడమే పెద్ద రిస్క్ అని ఇరిగేషన్ ఇంజనీర్లు భయపడుతున్నారు. ఇది మొత్తం కూల్చడం కాదు.. కేవలం కుంగిన పిల్లర్లను మాత్రమే తొలగించాలి. ఈ క్రమంలో పక్కన ఉన్న పిల్లర్లు, బ్యారేజీ ఫౌండేషన్ దెబ్బతినకుండా పనులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇందుకోసం డైమండ్ కటింగ్ చేయాలని భావిస్తున్నారు. కుంగిన మూడు పిల్లర్లను జాగ్రత్తగా కూల్చేందుకు దాదాపు 2 నుంచి 3 నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పిల్లర్ల కూల్చివేత కోసం ముంబై నుంచి డైమండ్ కటింగ్ మెషీన్లు తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బ్యారేజీ పునాదిపై ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రైవేట్ఏజెన్సీతో ఎల్‌అండ్‌టీ సంస్థ రాడార్సర్వే చేయించనుంది. మేడిగడ్డ బ్యారేజీని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1,632 మీటర్ల పొడవుతో నిర్మించిన సంగతి తెలిసిందే.
ఎనిమిది బ్లాక్‌లలో 85 గేట్లను అమర్చాడానికి రూ.3,625 కోట్లు ఖర్చు అయ్యాయి. బ్యారేజీ ప్రారంభం అయిన నాలుగున్నర సంవత్సరాలకే పనికి రాకుండా పోయింది. అక్టోబర్ 21న బ్లాక్ 7లోని మూడు పిల్లర్లు కుంగిపోగా.. అంతకు ముందు 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుకు కుంగిపోయి, పెద్దపెద్ద క్రాక్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications