ప్రభుత్వ ఉద్యోగమే అతని ప్రాణం తీసిందా
కరీంనగర్ : ప్రభుత్వ ఉద్యోగం రాదేమోననే భయం ఓ యువకుడి మరణానికి కారణమైంది. ప్రభుత్వం ఉద్యోగం వస్తోందని అందరి ఆశలు అతనిపై పెట్టుకొన్నారు. ఒక వేళ తనకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే తనపై విశ్వాసం ఉంచిన వారికి ఎలా ముఖం చూపాలని మనోవేదనకు గురైన ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కరీంనగగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన మంత్రి సమ్మయ్య, రాజమ్మ దంపతుల కుమారుడు రాజు ఆత్మహత్య చేసుకొన్న ఘటన ఆ కుటుంబంలో విసాదాన్ని నింపింది.సమ్మయ్య హామాలీ పనిచేస్తాడు. రాజు ఎంబిఏ చదివాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయంగా ఉంటున్నాడు. ప్రస్తుతం గ్రూప్ 2 పరీక్షలకు సిద్దమౌతున్నాడు.

రాజు కు సోదరి ఉంది. ఆమె పేను లత. ఆమె భర్త కుమార్ కూడ రాజు పై ప్రేమ ఉంది. రాజు కు ప్రభుత్వ ఉద్యోగం వస్తోందని ఆ కుటుంబసభ్యులు నమ్ముతారు.గ్రూప్ పరీక్షలకు సిద్దమౌతోన్న రాజుపై తీవ్రంగా ఒత్తిడికి గురౌతున్నాడు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే అందరి ముందుకు చులకన అవుతాననే భయం పట్టుకొంది రాజుకు.
ఆదివారం సాయంత్రం తన సోదరి ఇంటికి మోత్కుల గూడెం వచ్చాడు రాజు.స్నేహితుల వద్దకు వెళ్తున్నానని చెప్పి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహాత్యకు పాల్పడ్డాడు రాజు. స్థానికులు చూసి రాజు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.రాజు ప్యాంట్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది.












Click it and Unblock the Notifications